Abn logo
Jun 4 2020 @ 05:41AM

రేపు కాల్వలకు నీటి విడుదల

అసంపూర్తిగా మరమ్మతు పనులు


నిడదవోలు, జూన్‌ 3 : పశ్చిమ డెల్టా కాలువలకు 5వ తేదీ శుక్రవారం నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎమ్‌.దక్షిణామూర్తి తెలిపారు. ఏప్రిల్‌ 30న కాలువలు కట్టేసిన అనంతరం సుమారు 36 రోజుల అనంతరం 5వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు విజ్జేశ్వరం హెడ్‌ స్లూయీజ్‌ వద్ద గోదావరి మాతకు పూజలు నిర్వహించి సాగు, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయనున్నారు.  ఇదిలా ఉంటే నీటి విడుదలతో కాల్వల మరమ్మతు పనులు చాలా చోట్ల అసంపూర్తిగానే నిలిచిపోనున్నాయి. పశ్చిమ డెల్టా పరిధిలోని 29 మండలాల్లోను కాలువల నిర్వహణ, తూడు తొలగింపు, లాకులు, స్లూయీజ్‌లకు మరమ్మతులు నిర్వహించేందుకు నీటి పారుదల శాఖాధికారులు ఈ ఏడాది 128 పనులను చేపట్టేం దుకు రూ. 13.24 కోట్లతో టెండర్లను పిలిచింది. అయితే కాంట్రా క్టర్లు 90 పనులకు సంబంధించి మాత్రమే టెండర్లను దాఖలు చేశారు. ఈ 90 పనులకు రూ.9.51 కోట్లతో పనులు ప్రారం భించారు. అయితే కాలువలు మూసివేసి తిరిగి కాలువలు వదిలే సమయం సుమారు 36 రోజులు మాత్రమే ఉండడంతో పనులు చాలాచోట్ల అసంపూర్తిగానే నిలిచిపోయాయని పలు వురు రైతులు ఆరోపిస్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement