బాధితులకు సత్వర న్యాయం అందించాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-24T05:25:45+05:30 IST

నేరాలను అరికట్టడంలోనూ కేసులను చేధించి బాధి తులకు సత్వర న్యాయం చేయడంలోనూ పోలీసు అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు.

బాధితులకు సత్వర న్యాయం అందించాలి : ఎస్పీ

  సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఏలూరు క్రైం, అక్టోబరు 23 : నేరాలను అరికట్టడంలోనూ కేసులను చేధించి బాధి తులకు సత్వర న్యాయం చేయడంలోనూ పోలీసు అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు. జిల్లా నేరసమీక్షను ఏలూరు లోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించా రు. అన్ని సబ్‌ డివిజన్‌ల డీఎస్పీలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. ఆయా పోలీసు స్టేష న్‌లకు సంబంధించిన కేసులను, వాటి పురోగతిని ఎస్పీ అడిగి తెలు సుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చోరీ కేసుల్లో దొంగలను త్వరితగతిన పట్టుకో వాలని సొత్తు రికవరీ చేసి బాధితులకు అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. మద్యం రవాణాను అరికట్టాలన్నారు. ఖైనీ, గుట్కాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. అంతర రాష్ట్ర చెక్‌ పోస్టులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. పెండింగ్‌ కేసులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. మహిళల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని దిశ యాప్‌ను అందరూ ఇన్‌ స్టాల్‌ చేసుకునే విధంగా చూడాలన్నారు. సిబ్బంది అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే సహించేదిలేదన్నారు. దీపావళి పండుగ వస్తున్న సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉం డాలన్నారు. అదనపు ఎస్పీ సుబ్బరాజు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ జయరామ రాజు, ఎస్‌బీ డీఎస్పీ రమేష్‌రెడ్డి, ఏలూరు డీఎస్సీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌, కొవ్వూరు, నరసాపురం డీఎస్పీలు శ్రీనాథ్‌, వీరాంజనేయరెడ్డి, జంగా రెడ్డి గూడెం, పోలవరం డీఎస్పీలు రవికిరణ్‌, లతాకుమారి, దిశ పోలీసు స్టేషన్‌ డీ ఎస్పీ సత్యనారాయణ, సీసీఎస్‌ డీఎస్పీ  పైడేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, శుభాకర్‌, ఎస్‌బీ సీఐ కొండలరావు పలువురు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-24T05:25:45+05:30 IST