12 గంటల వరకే బస్సులు

ABN , First Publish Date - 2021-05-05T06:04:35+05:30 IST

ఇప్పటి వరకూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజా రవాణా శాఖ (ఆర్‌టీసీ) బస్సులు నేటి నుంచి మధ్యాహ్నం వరకే అందుబాటులో ఉండనున్నాయి

12 గంటల వరకే బస్సులు

దూర ప్రాంతాలకు ఒక్కరోజు మినహాయింపు

పూర్తిగా రద్దు చేసే యోచనలో పీటీడీ

 ప్రభుత్వ ఆదేశాలకు ఎదురుచూపు

ఏలూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజా రవాణా శాఖ (ఆర్‌టీసీ) బస్సులు నేటి నుంచి మధ్యాహ్నం వరకే అందుబాటులో ఉండనున్నాయి. బుధవారం నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే బస్సులు నడపాలని పీటీడీ రీజనల్‌ కార్యాలయం నిర్ణయించింది. కరోనా వ్యాప్తికి ముందు జిల్లా వ్యాప్తంగా 572 బస్సులు నడిపేవారు. కరోనా కారణంగా ప్రయాణికులు తగ్గడంతో 30 శాతం బస్సులను రెండు దఫాలుగా రద్దు చేశారు. బస్సుల సంఖ్యను సగానికి తగ్గించాలని తొలుత భావించినప్పటికీ, కర్ఫ్యూ ప్రకటనతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దూర ప్రాంత బస్సులకు మాత్రం ఒక్కరోజు మినహాయింపు ఇచ్చారు. హైదరాబాదుకు రాకపోకలు జరిపే 15, తిరుపతి, విశాఖపట్నం నుంచి రాకపోకలు జరిపే 8 బస్సులను బుధవారం కూడా నడపనున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో దూర ప్రాంతం నుంచి వచ్చేవారు పడిన ఇబ్బందులు దృష్టిలో ఉంచు కుని ఈ నిర్ణయం తీసుకున్నామని పీటీడీ అధికారులు చెబుతున్నారు. ప్రయా ణికుల అవసరాన్ని బట్టి ప్రభుత్వ అనుమతి తీసుకుని మరికొన్ని రోజులు ఈ సర్వీసులు నడుపుతామని ఇన్‌చార్జి రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.   

Updated Date - 2021-05-05T06:04:35+05:30 IST