చాపకింద నీరులా కరోనా

ABN , First Publish Date - 2021-07-31T05:28:32+05:30 IST

లూరు రూరల్‌ మండల గ్రామాల్లో కరోనా కేసులు చాపకింద నీరులా క్రమేణ పెరుగుతుండ డంతో అధికారులు ఆందోళన చెందుతున్నా రు.

చాపకింద నీరులా కరోనా
గుడివాకలంకలో బ్లీచింగ్‌

ఏలూరు రూరల్‌ మండలంలో ఒక రోజే 10 కేసులు

ఏలూరు రూరల్‌, జూలై 30: ఏలూరు రూరల్‌ మండల గ్రామాల్లో కరోనా  కేసులు చాపకింద నీరులా క్రమేణ పెరుగుతుండ డంతో అధికారులు ఆందోళన చెందుతున్నా రు. మండలంలో శుక్రవారం 10 కేసులు న మోదయ్యాయి.  కొవిడ్‌ వ్యాక్సిన్‌ రావడంతో చాలామంది నిర్లక్ష్యంగా మాస్క్‌లు లేకుం డానే రోడ్లపై తిరుగుతున్నారు. కొవిడ్‌ నిబం ధనలు పాటించకపోవడం వల్లే కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. ‘రెండు డోసులు వేయించుకున్న తర్వాత కూడా మాస్క్‌లు ధరించాల్సిందే.. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలి’.. అని డాక్టర్‌ దేవ్‌ మనోహర్‌ కిరణ్‌ సూచించారు. 

దెందులూరు : దెందులూరు మండలంలోని రామారావుగూడెం, మేదిన రావుపాలెం, గాలాయగూడెం, కొవ్వలిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు  కేసులు నమోదయినట్టు తహసీల్దార్‌ వి.నాంచారయ్య, ఎంపీడీవో లక్ష్మి తెలిపారు.   

పెదపాడు : పెదపాడు మండలం వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో కలపర్రులో మూడు, ఏపూరులో ఒక పాజిటివ్‌ కేసు నమోదు కాగా, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో పెదపాడులో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. 

పెదవేగి : పెదవేగి మండలంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య శుక్రవారం తగ్గాయి. శుక్రవారం మండలంలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మండలంలో 1577 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వారిలో హోం ఐసొలేషన్‌లో 1355 మంది ఉండి చికిత్స పొందినట్టు పెదవేగి ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ టీవీఎల్‌.ప్రసన్నకుమార్‌ చెప్పారు. ప్రస్తుతం 82మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని, 104 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. 

Updated Date - 2021-07-31T05:28:32+05:30 IST