కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా ప్రభుత్వ పాఠశాలలు

ABN , First Publish Date - 2021-05-05T05:49:53+05:30 IST

సునామీలా విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న అన్ని చర్యలను వేగవంతం చేశారు.

కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా ప్రభుత్వ పాఠశాలలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 4 : సునామీలా విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న అన్ని చర్యలను వేగవంతం చేశారు. హోం ఐసోలేషన్‌కు అవకాశం లేని బాధితులకు షెల్టర్‌ కల్పించి వైద్య చికిత్సలు అందించడం ద్వారా కరోనా వైరస్‌ సంక్రమణ గొలుసును తెగ్గొట్టేందుకు 8,586 పడకలతో 11 కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసు ్తన్నారు. వీటితో పాటు ఇంకా ఎక్కడైనా అవసరమనుకుంటే స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలను కూడా కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా వినియో గించుకునేందుకు వీలుగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు మినహా మిగతా పాఠశాలల భవనాలను సిసిసి (కొవిడ్‌ కేర్‌ సెంటర్లు)లుగా మార్చేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పాఠశాలల తరగతి గదుల్లో పడకలను ఏర్పాటు చేయ నున్నారు. పాఠశాలల్లో కొవిడ కేంద్రాల ఏర్పాటు అధికారం జిల్లా యంత్రాం గానికి అప్పగించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లులలోని ఏపీ టిడ్కో, ఏలూరు సిఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, మహిళా కళాశాల, పాలిటెక్నిక్‌, తణుకు ఎస్‌ఎంవిఆర్‌ఎం పాలిటెక్నిక్‌, భోగాపురం విజ్ఞాన్స్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ స్కూలు, భీమవరం విష్ణు కళాశాల, ఎస్‌వికెపి కళాశాల, తాడేపల్లిగూడెం నిట్‌లలో పడకల సంఖ్యను 8,586కి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసు కున్నారు. ట్రిపుల్‌ సిలలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-05T05:49:53+05:30 IST