నగరంలో విజృంభిస్తున్న డెంగీ

ABN , First Publish Date - 2021-10-17T04:49:51+05:30 IST

ప్రాణాంతక డెంగీ జ్వరాలు నగర వ్యాప్తంగా విస్తరిస్తుండడంతో నగరవాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

నగరంలో విజృంభిస్తున్న డెంగీ
డెంగీ వ్యాపిత ప్రాంతంలో తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో

 డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు.. సిబ్బందికి సూచనలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 16 : ప్రాణాంతక డెంగీ జ్వరాలు నగర వ్యాప్తంగా విస్తరిస్తుండడంతో నగరవాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిసరాలు పరి శుభ్రంగా ఉంచకపోవడం, మురుగునీటి నిల్వలు డెంగీ వ్యా ప్తికి కారకాలుగా నిలుస్తున్నాయి. ఈనెలలో ఇప్పటికే 15 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, వెంకటాపురంలో ఒకరు మరణించారు. తాజాగా శని వారపుపేట, పాములదిబ్బ ప్రాంతాల్లో రెండు డెంగీ కేసులు నమోదుకావ డంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఏలూరు సబ్‌డివిజన్‌ పరిధి లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 105 డెంగీ కేసులు నమోదు కాగా, కేవలం ఈ ఒక్క నెలలోనే 15 పాజిటివ్‌ కేసులు నమోదు కావ డం, ఒకరు మరణించడం తీవ్రతకు సంకేతాలుగా ఉన్నాయి. నివాస గృహాల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది చేపడుతున్న తనిఖీల్లో ప్రధానంగా మంచినీటి తొట్టెల్లో నిల్వ ఉంచుతున్న నీళ్లల్లోనే డెంగీ దోమ లార్వా వృద్ధి చెందుతున్నట్టు గుర్తించారు. డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో దోమల నివారణకు పొగ మందు చల్లడం, ఫీవర్‌ సర్వే, స్థానికులను జ్వరాల పట్ల అప్రమత్తం చేస్తున్నా నిత్యం కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం గమనార్హం. 


ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక విభాగం అత్యవసరం 

కొవిడ్‌ వ్యాప్తి కారణంగా జనరల్‌ వైద్య సేవలు, ఇన్‌పేషెంట్‌ సేవలు పూర్తి స్థాయిలో ఏలూరు కేంద్ర జిల్లా ప్రభుత్వాస్పత్రిలో లభించడం లేదు. కొన్ని రకాల కేసులకు మాత్రమే ఇన్‌పేషెంట్‌ సేవలు అందుతున్నాయి. ఫలితంగా డెంగీ జ్వర పీడితులు వైద్యం నిమి త్తం ప్రైవేటు ఆస్పత్రులను ఆ శ్రయిస్తుండగా, అక్కడ ప్లేట్‌ లెట్ల కౌంట్‌ తగ్గుదల పేరిట రూ.లక్షల్లో దోచేస్తున్నట్టు బా ధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రిలో డెంగీ కేసుల పర్యవేక్షణ, వైద్య సేవలకు ప్రత్యేక విభాగాన్ని అత్యవసరంగా తెరవాల్సి ఉంది. 


ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి : డీఎంహెచ్‌వో రవి

డెంగీ జ్వరాల పట్ల భయపడాల్సిన అవసరం లేదని, కాని అప్రమత్తంగా ఉండాలని, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రవి సూచించారు. శనివారం శనివారపుపేట, నగరంలోని పాముల దిబ్బ ప్రాంతాల్లోని  డెంగీ బాధిత వీధుల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ డెంగీ జ్వరాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయ న్నారు. వైద్య సిబ్బంది ప్రతీ రోజూ ఫీవర్‌ సర్వే నిర్వహించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలన్నారు. విధి నిర్వహణలో అశ్రద్ధ చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మలేరియా అధికారి జె.గోవిందరావు, సూపర్‌వైజర్‌ కృష్ణ, ఏఎన్‌ఎంలు భారతి, దుర్గాదేవి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T04:49:51+05:30 IST