Advertisement
Advertisement
Abn logo
Advertisement

హోంగార్డులవి ఉత్తమ సేవలు : డీఐజీ

ఏలూరు క్రైం, డిసెంబరు 6: హోంగార్డులు చేస్తున్న సేవలు ఎంతో ఉత్తమ మైనవని ఏలూరు రేంజ్‌ డీఐజీ కె.వి.మోహన్‌రావు కొనియాడారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం హోంగార్డ్సుడేను నిర్వహించగా ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోంగార్డులు అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు బహుమతులు అందించారు. ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సి.జయరామ రాజు, డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌కిరణ్‌, జిల్లాలోని డీఎస్పీలు పాల్గొన్నారు. 

గౌరవ వందనం చేస్తున్న హోంగార్డులు


Advertisement
Advertisement