క్రీడల అభివృద్ధికి కరోనా అడ్డు

ABN , First Publish Date - 2021-05-15T06:26:23+05:30 IST

సమాజంలో ప్రతి విద్యార్థి దాదాపుగా ఏదో ఒక ఆటలో ఆడాలని ఖచ్చితంగా చూస్తాడు.

క్రీడల అభివృద్ధికి కరోనా అడ్డు

ఏలూరు స్పోర్ట్స్‌, మే 14 : సమాజంలో  ప్రతి విద్యార్థి దాదాపుగా ఏదో ఒక ఆటలో ఆడాలని ఖచ్చితంగా చూస్తాడు. అందుకు  ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కొంతసమయం కేటాయించి చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తు న్నారు. అయితే సంవత్సరంగా కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు దాదా పుగా క్రీడలకు దూరమై అసంతృప్తితో ఉన్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఒక్క క్రీడా పోటీ జరగకపోవడం గమ నార్హం. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, శాప్‌ క్రీడలు నిర్వహించడానికి కరోనా విజృం భణ అడ్డుపడుతోంది. కరోనా ఉన్నప్పటికీ కొవిడ్‌ – 19 నిబంధనల ప్రకారం కొన్ని క్రీడా సంఘాలు పోటీలు నిర్వహించారు.  వేసవి క్రీడా శిక్షణ శిభిరాలు కూడా వరుసగా రెండో ఏడాది కూడా రద్దయినట్టు చెప్తున్నారు. దీంతో క్రీడా కారులు మరింత నిరాశకు గురవుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించకపోవడంతో అర్హత గల క్రీడాకారులు సర్టిఫికెట్లు కో ల్పోవడంతో పాటు ఆయా ఉద్యోగ, విద్యా, రిజర్వేషన్లలో కోటా కోల్పోయే ప్ర మా దం లేకపోలేదు. అర్హులైన క్రీడాకారులు మరింత ఆందోళనకు గురవుతు న్నారు. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో క్రీడలకు ఏమాత్రం సాను కూలంగా లేదని క్రీడా నిపుణులు, కోచ్‌లు చెబుతున్నారు. ఇప్పటికే  జిల్లా వ్యాయామశాలలు, క్రీడా మైదానాలు అకాడమీలు మూతపడ్డాయి.  

Updated Date - 2021-05-15T06:26:23+05:30 IST