సొంత ఖర్చుతో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌

ABN , First Publish Date - 2021-05-18T05:41:01+05:30 IST

భీమవరంలో ఆక్సిజన్‌ సమస్య తరుచూ ఏర్పడటంతో తీవ్రమైన ఇబ్బం దులు పడుతున్న కరోనా రోగుల కోసం సొంత నిధులతో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ కొనుగోలు చేయటానికి గ్రంధి శ్రీనివాస్‌ నిర్ణయించారు.

సొంత ఖర్చుతో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌

సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ 

భీమవరం, మే 17 : భీమవరంలో ఆక్సిజన్‌ సమస్య తరుచూ ఏర్పడటంతో తీవ్రమైన ఇబ్బం దులు పడుతున్న కరోనా రోగుల కోసం సొంత నిధులతో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ కొనుగోలు చేయటానికి గ్రంధి శ్రీనివాస్‌ నిర్ణయించారు. సోమవారం ఆయన జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లాతో మాట్లాడారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ విక్రయించే సంస్థల ప్రతినిధులతో  మాట్లాడారు. తొలి దశలో 30 ఐదు లీటర్ల ఆక్సిజన్‌ కాన్సంట్రే టర్స్‌, 10 పదిలీటర్ల ఆక్సిజన్‌కాన్సంట్రేటర్స్‌ కావాలని కోరారు. సంస్థ ప్రతినిధులు హామీ ఇవ్వడంతో ఈవారంలో మంజూరయ్యే అవకాశం ఉంది.తొలిదశగా మంజూరయ్యే వాటిని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. 


Updated Date - 2021-05-18T05:41:01+05:30 IST