ధరల బాదుడు

ABN , First Publish Date - 2021-10-13T05:30:00+05:30 IST

ఇంధన ధర తగ్గనంటోంది. రోజు రోజుకూ పైపైకి ఎగబాగుతోంది. పెట్రోలు, డీజిల్‌కు తోడు గ్యాస్‌ ధర మండిపోవడంతో సామాన్య ప్ర జానీకం అల్లాడిపోతోంది.

ధరల బాదుడు

భారీగా పెరుగుతున్న ఇంధన ధరలు 

వణుకుతున్న సామాన్య జనం

ఏలూరు రూరల్‌, అక్టోబరు 13 : ఇంధన ధర తగ్గనంటోంది. రోజు రోజుకూ పైపైకి ఎగబాగుతోంది. పెట్రోలు, డీజిల్‌కు తోడు గ్యాస్‌ ధర మండిపోవడంతో సామాన్య ప్ర జానీకం అల్లాడిపోతోంది. గత జులై నుంచి 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పెరు గుతూ వస్తోంది. జూన్‌లో రూ.846.50 పైసలు సిలిండర్‌ ధర ఉండగా, జులైలో రూ.872, అక్టోబరులో రూ.937లకు పెరిగింది. ఇప్పటి వరకూ ఒక సిలిండర్‌పై రూ.90.50 పెరిగింది. ప్రతినెలా రూ.25లకు తగ్గకుండా సిలిండర్‌ ధర పెరుగుతోం ది. జిల్లాలో 8.5 లక్షల గ్యాస్‌ విని యోగ దారులు ఉండగా, నాలుగు నెలల వ్య వధిలో రూ.7.6 కోట్ల భారం పడింది.  పెట్రోల్‌ ధర ఆకాశాన్నంటుతోంది. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 109.56 ఉంది. ప్రతిరోజు పది నుంచి 20 పైసలు పెరు గుతూనే ఉంది. దీంతో సామాన్య వినియోగదారులు హడలిపోతున్నారు. దగ్గర దూరమే అయితే  సైకిళ్ల వైపు దృష్టి సారిస్తు న్నారు. తానేమీ తక్కువ తిన్నానంటూ డీజిల్‌ ధర పెరిగిపోతోంది. డీజిల్‌ ధర పెంపు అన్ని వర్గాలపై పడుతోంది. 

Updated Date - 2021-10-13T05:30:00+05:30 IST