Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్పెషల్‌ పార్టీ పోలీసులకు పునఃచ్ఛరణ తరగతులు

ఏలూరు క్రైం, డిసెంబరు 2 : జిల్లా పోలీస్‌ శాఖలోని స్పెషల్‌ పార్టీ పోలీసు అధికారులు శారీరక ధృడత్వంతో పాటు క్షేత్రస్థాయిలో సమయానుకూలంగా మెల కువలు నేర్చుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ ఆదేశాల మేరకు స్పెషల్‌ పార్టీ పోలీసు అధికారులకు పునఃచ్ఛరణ తరగతు లను ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించారు. ఈ తరగతు ల్లో భాగంగా శారీరక వ్యాయామం, మానసిక ఒత్తిడిని జయించే యోగా కార్య క్రమాలు నిర్వహించారు. శారీరక ధృడత్వం కోసం వ్యాయామాలు నిర్వహిం చా రు. సిబ్బందికి  సూచనలు, సలహాలు ఇచ్చారు. విధి నిర్వహణలో ఏ విధంగా ఉండాలో తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్‌ ఆర్‌ఐలు మనోహర్‌, కృష్ణంరాజు, ఆర్‌ ఎస్‌ఐలు గోపికృష్ణ, సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement