కరోనా టెన్షన్‌..

ABN , First Publish Date - 2021-05-17T05:27:44+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ రోగు లతో కిటకిటలాడుతున్నాయి.

కరోనా టెన్షన్‌..
వెంకటాపురం పంచాయతీలో సూపర్‌ శానిటేషన్‌

గ్రామాల్లో రోజురోజుకు ఉధృతి

ఏలూరు మండలంలో 700 దాటిన కేసులు


ఏలూరు రూరల్‌, మే 16:  ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ రోగు లతో కిటకిటలాడుతున్నాయి. కంటైన్మెంట్‌ జోన్లు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. ఏలూరు రూరల్‌ మండలంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఆదివారం 34 నమో దయ్యాయి. ఇప్పటి వరకు 700 దాటాయి. శనివారపుపేట, వెంకటాపురం పం చాయతీల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడిలో అధికారు లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాం తాల నుంచి కరోనా లక్షణాలతో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అధికారులు, అన్ని వర్గాల ప్రజలకు కొవిడ్‌ నిబం ధనలతో పాటు హెచ్చరికలు, అవగాహన కల్పిస్తున్న కరోనా మాత్రం కట్టడికావడం లేదన్న విమర్శలకు దారి తీస్తోంది. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో రెడ్‌జోన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తు న్నారు. ఇప్పటికే చాలామంది కొవిడ్‌ బాధితులు హోం ఐసో లేషన్‌లో వైద్య సేవలు పొందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కొవిడ్‌ టెస్టులు వేగవంతం చేయడంతో అదే స్పీడుతో పాజిటివ్‌ కేసులు బయట పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అని అధికార యంత్రాంగం ఆం దోళన చెందుతోంది.


 దెందులూరు మండలంలో 13 కేసులు 

దెందులూరు, మే 16: మండలంలో కరోనా కేసులు ప్రతిరోజు పెరుగుతుం డటంతో మండలవాసుల్లో ఆందోళన పెరుగుతోంది. తాజాగా ఆదివారం 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని  తహ సీల్దార్‌ వి.నాంచారయ్య తెలిపారు. కొవ్వలిలో 8, పోతునూరు 2, దోసపాడు 1, చల్లపల్లి 1, కొత్తపల్లి 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. రెండు మాస్కులు ధరించాలని, తప్పని సరిగా భౌతిక దూరం పాటించాలని, తరచు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకో వాలన్నారు. శానిటేజర్‌ వాడుతూ కరోనా నిబం ధనలు పాటించాలన్నారు. 


పెదపాడు మండలంలో 25 కేసులు

పెదపాడు 16: పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో పెదపాడు, వసంతవాడ, నాయుడుగూడెం గ్రామాల్లో రెండేసి, వీరమ్మకుంట, పాతముప్పర్రులో మూడు చొప్పున, కొత్తముప్పర్రులో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో ఏపూరు, కొత్తూరులలో ఒక్కొక్కటి, కొక్కెరపాడులో 2, కలపర్రులో 3, వట్లూరులో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


ఫీవర్‌ సర్వేపై తహసీల్దార్ల పర్యవేక్షణ 

ఏలూరు రూరల్‌, మే 16 : ఫీవర్‌ సర్వేను పక్కా చేయించే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. క్షేత్రస్థా యిలో గ్రామాల్లో సర్వేను పర్యవేక్షిం చా లి. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్క ర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లాల్సి ఉంది. కొవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ గ్రామాలకు విస్తరించింది. రోజురోజుకూ పాజిటివ్‌ లు పెరుగుతున్నాయి. దీంతో ఇంటింటి సర్వేద్వారా కట్టడి చేయాలని వైద్య ఆరో గ్య శాఖ నిర్ణయించింది. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కరోనా వైరస్‌ వచ్చిన వారికి సహజంగా కనిపిస్తాయి. ఇలాంటి వారిని గుర్తించి పరీక్షలు చేయడం, హోం ఐసోలేషన్‌ విధించడం, మందులు ఇవ్వడం చేస్తున్నారు. పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తి ఆరోగ్యస్థితిని బట్టి హోం ఐసోలేషన్‌ లేదా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా ఆస్పత్రిలో చేర్చుతారు. నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన వారికి సాధార ణ జ్వరంగా భావించి తగిన సూచనలు చేస్తున్నారు. ఫీవర్‌ సర్వేవలంటీర్లు మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పాజిటివ్‌లు పెరు గుతున్నాయి. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు పని భారం పెరిగింది. ఇంటింటికీ వెళ్లి స్వయంగా సర్వే చేయలేక పోతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆశించిన ఫలి తం రావడం లేదు. 

Updated Date - 2021-05-17T05:27:44+05:30 IST