వయసుతో నిమిత్తం లేకుండా టీచర్లందరికీ వ్యాక్సిన్‌ వేయాలి

ABN , First Publish Date - 2021-05-06T04:57:35+05:30 IST

కరోనా రెండో దశ ప్రభావం తీవ్రత ఎక్కు వగా ఉపాధ్యాయులపై ఉందని, జిల్లాలో గడచిన 20 రోజుల్లో దాదాపు 20 మంది టీచర్లు కరోనా బారిన పడి మరణించారని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్‌, బి.గోపిమూర్తి వివరించారు.

వయసుతో నిమిత్తం లేకుండా   టీచర్లందరికీ వ్యాక్సిన్‌ వేయాలి

 యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల డిమాండ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 5 : కరోనా రెండో దశ ప్రభావం తీవ్రత ఎక్కు వగా ఉపాధ్యాయులపై ఉందని, జిల్లాలో గడచిన 20 రోజుల్లో దాదాపు 20 మంది టీచర్లు కరోనా బారిన పడి మరణించారని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్‌, బి.గోపిమూర్తి  వివరించారు. వందల మంది టీచర్లు ఇంకా హాస్పటల్స్‌లోను, ఇళ్ల దగ్గర మృత్యువుతో పోరాడుతున్నా రన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీచర్ల ప్రాణాలు కాపాడే బాధ్యతను తీసుకోవా లని కలెక్టర్‌కు విన్నవించినట్టు వివరించారు. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఐసొ లేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి సరైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. వయస్సుతో సంబంధం లేకుండా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్‌ వేయాలని కోరారు. మొదటి డోసు టీకా మందు వేయించుకున్న ఉపాధ్యాయులకు రెండో డోసు వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవే డిమాండ్లతో ఆరో గ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, డీఈవోలకు వినతిపత్రాలను ఆన్‌లైన్‌లో పంపించినట్టు వివరించారు.


పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లకు సెలవులు మంజూరు చేయాలి

జిల్లాలో నాడు–నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో పెయింటింగ్‌ పనులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు డ్రాయింగ్‌ టీచర్లకు కొన్ని రోజులు విధుల నుంచి విరామం కల్పించాలని కోరుతూ ఆర్ట్‌, వర్క్‌, హెల్త్‌, ఫిజి కల్‌ ఎడ్యుకేషన్‌ పార్ట్‌టైం కాంట్రాక్ట్‌ ఇన్‌స్ట్రక్టర్ల సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు షేక్‌ జరీనా, వాసా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీఈ వో సీ.వి.రేణుకకు బుధవారం వినతిపత్రాన్ని అందజేశామన్నారు. 

Updated Date - 2021-05-06T04:57:35+05:30 IST