పోలీసు వాహనంపై మనసు పారేసుకున్న వ్యక్తి.. తన కోరిక తీర్చుకోవడం కోసం ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-02-06T03:12:43+05:30 IST

కర్ణాటకలో ఓ వ్యక్తి తన కోరిక తీర్చుకోవడం కోసం ఏకంగా పోలీసు వాహనాన్నే వాడుకున్నాడు. ఆ వాహనాలపై ఎప్పటి నుంచో ప్రేమ పెంచుకున్నాడట. ఇతడి వింత కోరిక విని పోలీసులే అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..

పోలీసు వాహనంపై మనసు పారేసుకున్న వ్యక్తి.. తన కోరిక తీర్చుకోవడం కోసం ఏం చేశాడంటే..

ఎవరి జోలికి వెళ్లినా.. వెళ్లకపోయినా.. పోలీసుల జోలికి వెళ్లేందుకు ఎంతటి వారైనా సాహసించరు. వారిని చూస్తేనే అదోరకం భయంతో ఆమడదూరం వెళ్లిపోతుంటారు. అలాంటిది వారి వాహనాల జోలికి వెళ్తామా.. చచ్చినా వెళ్లం కదా! అయితే కర్ణాటకలో ఓ వ్యక్తి తన కోరిక తీర్చుకోవడం కోసం ఏకంగా పోలీసు వాహనాన్నే వాడుకున్నాడు. ఆ వాహనాలపై ఎప్పటి నుంచో ప్రేమ పెంచుకున్నాడట. ఇతడి వింత కోరిక విని పోలీసులే అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..


కర్ణాటకలోని అన్నిగెరి పట్టణానికి చెందిన నాగప్ప.. ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా లారీల్లో వివిధ ప్రాంతాలకు తిరిగేవాడు. అయితే ఇతడికి ఓ బలమైన కోరిక ఉండేది. ఆ కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలని ఎన్నాళ్ల నుంచో వేచి చూసేవాడు. ఇంతకీ అతడి కోరిక ఏంటో తెలుసా.? పోలీసు వాహనంలో లాంగ్ డ్రైవ్ వెళ్లాలనేదే అతడి జీవిత ఆశయమట. ఎవరికీ లేని విచిత్రమైన కోరికను నెరవేర్చుకునేందుకు చాలా కాలంగా వేచి చూస్తున్నాడు.

సూట్‌కేస్‌లో 22 ఏళ్ల కుర్రాడి మృతదేహం.. విచారణలో అసలు నిజాలు తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..


ఇటీవల అన్నిగెరి పీఎస్ బయట పోలీసు వాహనాన్ని ఆపి ఉండటం నాగప్ప గమనించాడు. వేకువజాము కావడం వల్ల పోలీసులు కారు వద్ద లేకపోవడంతో పాటూ తాళాలు కూడా దానికే ఉన్నాయి. తన చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని సంతోషపడ్డాడు. క్షణం ఆలోచించకుండా కారు తీసుకుని బయలుదేరాడు. రాత్రంతా తన కోరిక తీరేదాకా 112 కిలోమీటర్లు నడిపి.. హవేరి జిల్లాలోని మోటేబెన్నూరుకు చేరుకున్నాడు. అప్పటికి బాగా అలసిపోయి కారును రోడ్డు పక్కన ఆపి.. అందులోనే నిద్రకు ఉపక్రమించాడు. అయితే అతన్ని గమనించిన స్థానికులకు అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. అసలు విషయం తెలుసుకుని అన్నిగెరి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వాహనాన్ని వారికి అప్పగించారు. చోరీ కేసు నమోదు చేసి అతన్ని జైలుకు తరలించారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని విచారణలో తేలింది.

అయ్యో పాపం.. మరీ ఇంత ఘోరమా.. ప్రియుడి పెళ్లిని ఆపేందుకు ఈ యువతి ఎంత నీచానికి పాల్పడిందంటే..

Updated Date - 2022-02-06T03:12:43+05:30 IST