బస్సు డ్రైవర్‌ను ప్రేమించిన యువతి.. కొన్నాళ్లకు తన జీవితంలోకి ఎంటరైన మరో వ్యక్తి.. చివరికి రెండో ప్రేమికుడితో కలిసి..

ABN , First Publish Date - 2022-06-19T21:46:42+05:30 IST

వివాహేతర సంబంధాలు చివరకు విషాదాంతం అవుతాయనే విషయం తెలిసినా.. చాలా మంది అదే తప్పు చేస్తుంటారు. భర్తను కాదని భార్య, భార్యకు తెలీకుండా భర్తలు చేసే తప్పుల వల్ల..

బస్సు డ్రైవర్‌ను ప్రేమించిన యువతి.. కొన్నాళ్లకు తన జీవితంలోకి ఎంటరైన మరో వ్యక్తి.. చివరికి రెండో ప్రేమికుడితో కలిసి..

వివాహేతర సంబంధాలు చివరకు విషాదాంతం అవుతాయనే విషయం తెలిసినా.. చాలా మంది అదే తప్పు చేస్తుంటారు. భర్తను కాదని భార్య, భార్యకు తెలీకుండా భర్తలు చేసే తప్పుల వల్ల చివరకు వారి పిల్లలు అనాథలవడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువతి బస్సు  డ్రైవర్‌ను ప్రేమించింది. కొన్నాళ్లకు ఆమె జీవితంలోకి ఇంకో వ్యక్తి ఎంటరయ్యాడు. చివరికి ఇద్దరూ కలిసి చేసిన పని.. స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్‌పత్‌ అనే ప్రాంతానికి చెందిన విక్కీ తన్వర్(41) అనే వ్యక్తి బస్సు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఇతడికి స్థానిక ప్రాంతానికి చెందిన సోనియా అనే యువతి పరిచయమైంది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో విక్కీ తన్వర్‌పై సోనియా మనసు పడింది. ఇద్దరూ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సోనియాకు సంతోష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు అతడితో కూడా ప్రేమాయణం నడిపింది. ఒకరికి తెలీకుండా ఒకరితో కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో విక్కీ తన్వర్ విషయం సంతోష్‌కు తెలిసి సోనియాను నిలదీశాడు. తర్వాత ఇద్దరూ కలిసిపోయి.. విక్కీ తన్వర్‌ను అడ్డు తొలగించుకోవాలని కుట్రపన్నారు.

వాయిస్ బాగుందని యువతిని తన భజన బృందంలో చేర్చుకున్నాడు.. ఓ రోజు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేశాడు.. ఆరు నెలల తర్వాత చూస్తే..


విక్కీ తన్వర్‌ను జూన్ 13న గ్రామ పరిసరాల్లోకి పిలిపించారు. సోనియా, సంతోష్, మరికొంత మంది కలిసి.. విక్కీ తన్వర్‌ను గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని పొలాల్లో పడేసి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణ అనంతరం సోనియా, మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. నేరం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న సంతోష్, మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ చివరకు ఒకే ఒక్క కారణంతో..

Updated Date - 2022-06-19T21:46:42+05:30 IST