Divorce తీసుకున్నాను.. ఒక పాప కూడా ఉందన్న మహిళ.. అయినా సరే! పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు.. అద్దె గది తీసుకుని..

ABN , First Publish Date - 2022-07-13T21:39:54+05:30 IST

ఆడవారిని నమ్మించే క్రమంలో కొందరు ఎన్నో మాయమాటలు చెప్తుంటారు. అలాంటి వారి మాటలు నమ్మి ఎంతో మంది చివరకు మోసపోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, మధ్యప్రదేశ్‌లో...

Divorce తీసుకున్నాను.. ఒక పాప కూడా ఉందన్న మహిళ.. అయినా సరే! పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు.. అద్దె గది తీసుకుని..

ఆడవారిని నమ్మించే క్రమంలో కొందరు ఎన్నో మాయమాటలు చెప్తుంటారు. అలాంటి వారి మాటలు నమ్మి ఎంతో మంది చివరకు మోసపోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. విడాకులు తీసుకున్నాను, ప్రస్తుతం ఒక పాప కూడా ఉందని చెప్పిందో మహిళ. అయినా సరే! పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఎనిమిదేళ్లుగా అతడు చేసిన నిర్వాకం గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 35ఏళ్ల మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఈమెకు 2002లో వివాహం అవగా, భర్తతో విభేదాలు తలెత్తడంతో 2014లో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఓ కుమార్తెతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఇదిలావుండగా, శ్రీవాస్తవ అనే యువకుడు.. తన తండ్రికి కాలేయ చికిత్స చేయించేందుకు ఆస్పత్రిలో చేర్చాడు. ఆ సమయంలో మహిళతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వీరి మధ్య సన్నిహితం మరింత పెరిగింది.

రెండేళ్లు ప్రేమించుకున్న అనంతరం.. పెళ్లికి నిరాకరించిన యువతి.. ఆమె చెప్పిన కారణం విని షాకైన యువకుడు..


ఈ క్రమంలో ఓ రోజు, ‘‘నిన్ను పెళ్లి చేసుకుంటా’’.. అని మహిళతో చెప్పాడు. ఇందుకు ఆమె.. ‘‘నా భర్తతో విడాకులు తీసుకున్నాను, ప్రస్తుతం ఓ పాప కూడా ఉంది’’.. అని చెప్పింది. అయినా పర్లేదు! నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తర్వాత ఆమె కోరిక మేరకు.. గుడికి తీసుకెళ్లి, ఏడు ప్రదక్షిణలు చేయించాడు. తర్వాత.. ఓ గదిని అద్దెకు తీసుకుని ఆమెను అందులో ఉంచాడు. ఈ క్రమంలో ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఏదో ఒక సాకు చెప్పేవాడు. కొన్ని నెలలకు ఆమె గర్భం దాల్చింది. అయితే అబార్షన్ చేయించుకోవాలని బలవంత పెట్టాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడితో రోజూ చాటింగ్.. విషయం తెలిసి యాప్ డిలీట్ చేసిన తండ్రి.. దీంతో ప్రియుడి కోసం ఏకంగా..


ఇటీవల పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టడంతో... ఆమెపై దాడి చేశాడు. మాత్రలు తినిపించి, బలవంతంగా అబార్షన్ చేయించాడు. బయట ఎవరికైనా చెబితే నగ్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించేవాడు. ఇటీవల పెళ్లి విషయమై వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో.. విషం తినిపించి చంపేయాలని ప్రయత్నించాడు. స్థానికులు గమనించి, తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్రెండ్స్‌తో పాటూ Birthday వేడుకకు వెళ్లింది.. అందరితో సరదాగా గడిపి.. ఇంటికొచ్చి మొబైల్‌ చూసుకుని షాక్...

Updated Date - 2022-07-13T21:39:54+05:30 IST