రాత్రి వేళ యువతి ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. గదిలోకి వెళ్లి చూడగా..
ABN , First Publish Date - 2022-07-14T00:10:01+05:30 IST
వారిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉండడంతో ఎలాంటి సమస్యలూ ఉండేవి కావు. అయితే ఇటీవల వారి మధ్య ఊహించని సమస్యలు వచ్చిపడ్డాయి...
వారిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉండడంతో ఎలాంటి సమస్యలూ ఉండేవి కావు. అయితే ఇటీవల వారి మధ్య ఊహించని సమస్యలు వచ్చిపడ్డాయి. యువకుడు ఇటీవల రాత్రి వేళ ప్రేయసి ఇంట్లోకి వెళ్లాడు. అదే సమయంలో వారిని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గది తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. చివరకు అక్కడి దృశ్యం చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గ్‌లోని ఫేకారి గ్రామానికి చెందిన అర్చన సాహు అనే యువతి డయల్-112లో పని చేసేది. అదే గ్రామానికి చెందిన కమలేష్ సాహుతో కొన్నేళ్ల క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఈ పరిచయం ప్రేమగా మారింది. అర్చన ఇటీవల పాత బస్తీలోని బంద్వాపరాలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. కమలేష్ తరచూ ఆమె వద్దకు వెళ్లి వస్తుండేవాడు. అయితే ఇటీవల అర్చనపై కమలేష్‌కు అనుమానం మొదలైంది. అర్చన వేరే యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కమలేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ప్రేయసి ఇంటికి వెళ్లాడు.
robbery: సంచి నిండా cash ఉందనుకుని.. బెదిరించి మరీ లాక్కెళ్లారు.. బాధితుడు చెప్పింది విని అవాక్కయిన పోలీసులు..
ఆ సమయంలో అక్రమ సంబంధాల విషయంపై ఇద్దరూ గొడవ పడ్డారు. వీరి అరుపులు విని చుట్టుపక్కల వారు వారింటి వద్దకు వెళ్లారు. కమలేష్‌ను బయటికి పిలిచి, సర్దిచెప్పి పంపించారు. అయితే ఆ సమయంలో కమలేష్ దుస్తులపై రక్తం ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో.. బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో అర్చన రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా, కమలేష్ ఉరికి వేలాడుతున్నాడు. గదిలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అర్చనను సుత్తితో బాది హత్య చేసి, అనంతరం తానూ ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.