Uttar Pradesh: నేను చెప్పినట్లు చేస్తే రోజూ ఆదాయం వస్తుంది.. అంటూ భార్యకు నచ్చజెప్పాడు.. మరుసటి రోజే స్నేహితుడిని ఇంట్లోకి పిలిచి..
ABN , First Publish Date - 2022-07-09T00:53:58+05:30 IST
జల్సాలకు అలవాటుపడిన వారు, మద్యానికి బానిసైన వారు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దారుణాలకు తెగబడుతుంటారు. మన, తన అనే బేధం లేకుండా ఎవరినైనా మోసం..
జల్సాలకు అలవాటుపడిన వారు, మద్యానికి బానిసైన వారు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దారుణాలకు తెగబడుతుంటారు. మన, తన అనే బేధం లేకుండా ఎవరినైనా మోసం చేయడానికి.. అవరసమైతే చంపడానికి కూడా వెనుకాడరు. ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి.. సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. ‘‘నేను చెప్పినట్లు వింటే రోజూ ఆదాయం వస్తుంది.. అంటూ భార్యకు నచ్చజెప్పాడు. మరుసటి రోజు తన స్నేహితుడిని ఇంట్లోకి పిలిచి.. అతను చేసిన నిర్వాకం తెలుసుకుని.. అంటా ఛీకొడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ఓ యువకుడికి.. బన్స్‌గావ్ అనే ప్రాంతానికి చెందిన యువతితో 2021 నవంబర్‌లో ఓ యువతితో వివాహమైంది. యువతి కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో కట్నం పెద్దతా ఇవ్వలేకపోయారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా అని చెప్పిన యువకుడు.. ఖాళీగా ఉన్నాడే విషయం, పెళ్లి తర్వాత కొన్ని రోజులకు తెలిసింది. రోజూ ఫుల్‌గా మందు తాగి ఇంటికి వచ్చేవాడు. కట్నం పేరుతో భార్యను వేధించేవాడు. దీనిపై ప్రశ్నిస్తే భార్యపై దాడి చేసేవాడు. అయితే ఇటీవల అతడిలో రాక్షసుడు నిద్రలేచాడు. ఓ రోజు భార్య వద్దకు వెళ్లి.. నేను చెప్పినట్లు చేస్తే.. రోజూ ఆదాయం వస్తుందని నచ్చజెప్పాడు. మరుసటి రోజు స్నేహితుడిని ఇంటికి పిలిచి, ఇద్దరూ మద్యం సేవించారు.
Action: కర్ర, బియ్యం, పచ్చిమిర్చితో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మహిళ.. పోలీసుల నెత్తిపై అక్షింతలు చల్లి మరీ.. ఆమె చేసిన నిర్వాకం..
తర్వాత స్నేహితుడి పక్కన పడుకోవాలని భార్యపై ఒత్తిడి చేశాడు. దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలపడంతో దాడి చేశాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. స్నేహితుల నుంచి మందు కోసం డబ్బులు తీసుకోవడం, దానికి బదులుగా వారిని తన భార్య వద్దకు పంపించడం చేసేవాడు. రోజూ తాను చెప్పినట్లు చేయాలని, లేదంటే నగ్నంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించేవాడు. మొన్నటిదాకా భరించిన ఆమె.. రోజురోజుకూ వేధింపులు ఎక్కవ అవుతుండడంతో చివరకు గురువారం పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. అయితే స్థానిక పోలీసులు.. దీనిపై పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించింది. వారి ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న బాధితురాలి భర్త, అతడి స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.