భర్తే కదా అని.. అతడి ముందే దుస్తులు మార్చుకున్న భార్య.. అయితే ఆమెకు తెలీదు.. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయని.. చివరకు..

ABN , First Publish Date - 2022-07-03T23:50:59+05:30 IST

వివాహానంతరం భర్తే సర్వస్వంగా బతుకుతుంది భార్య. తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు సైతం భర్తతో పంచుకుంటుంది. అయితే కొందరు మగవారు మాత్రం భార్యలను నానా..

భర్తే కదా అని.. అతడి ముందే దుస్తులు మార్చుకున్న భార్య.. అయితే ఆమెకు తెలీదు.. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయని.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

వివాహానంతరం భర్తే సర్వస్వంగా బతుకుతుంది భార్య. తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు సైతం భర్తతో పంచుకుంటుంది. అయితే కొందరు మగవారు మాత్రం భార్యలను నానా ఇబ్బందులు పెడుతుంటారు. కట్టుకున్నవాడిలో కర్కోటకుడు ఉన్నాడనే విషయం ఆలస్యంగా తెలిసినా... కొందరు మహిళలు ఎలాగోలా జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. మరికొందరు మాత్రం ధైర్యంగా తిరగబడుతుంటారు. మధ్యప్రదేశ్‍‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. భర్తే కదా అని అతడి ముందే దుస్తులు మార్చుకునేది. కానీ అవన్నీ భర్త వీడియోల రూపంలో దాచుకున్నాడని తెలుసుకోలేకపోయింది. చివరకు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని లసుడియా అనే ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువతికి నాలుగేళ్ల క్రితం కాన్పూర్‌ పరిధికి చెందిన యువకుడితో వివాహం చేశారు. పెళ్లి సమయంలో 40 తులాల బంగారం, కారుతో పాటూ వివిధ వస్తువులను కట్నం కింద అందజేశారు. వివాహానంతరం హనీమూన్ పేరుతో భార్యను స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. అయినా భర్తే కదా అని తనకు తాను సర్దిచెప్పుకొంది. అయితే రోజురోజుకూ భర్త మరింత నీచంగా ప్రవర్తించేవాడు. అంతటితో ఆగకుండా భార్య స్నానం చేసే సమయంలో, దస్తులు మార్చుకునే సమయంలో పక్కనే ఉంటూ.. ఆమెకు తెలీకుండా వీడియోలు తీసేవాడు. కొన్నాళ్ల తర్వాత తాను తీసిన వీడియోలన్నింటినీ భార్యకు చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్ అయింది.

స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న బాలికలను చూసి.. పెట్రోల్ తీసుకొద్దామంటూ ఒకరిని బైక్‌పై ఎక్కించుకున్నాడు.. చివరకు పర్సు మర్చిపోయానంటూ..


‘‘పుట్టింటికి వెళ్లి.. మరో కోటి రూపాయలు తీసుకురా.. లేదంటే ఈ అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తా’’.. అంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. అత్తమామలు కూడా భర్తకే మద్దతు ఇచ్చారు. దీంతో చివరికి చేసేదిలేక.. భర్త చేసిన దారుణాన్ని కుటుంబ సభ్యులతో చెప్పి బోరున విలపించింది. ఇలాంటి భర్త తనకు వద్దంటూ నేరుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి భర్త, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. 

మీ కూతురు ఉరి వేసుకుందంటూ.. తల్లిదండ్రులకు స్థానికుల నుంచి ఫోన్.. పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన అసలు నిజం..

Updated Date - 2022-07-03T23:50:59+05:30 IST