భర్త చనిపోయిన నెల తర్వాత.. ఓ భార్య షాకింగ్ నిర్ణయం.. నా కూతుర్ని నువ్వే చూసుకో అంటూ లేఖలో తల్లికి రాసి మరీ..
ABN , First Publish Date - 2022-06-30T22:33:17+05:30 IST
మానసిక ఒత్తిడి తీవ్రమయ్యే దశలో.. కొందరికి చివరకు మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. మరికొందరు ఒత్తిడిని భరించలేక చివరకు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఢిల్లీ పరిధిలో తాజాగా ఇలాంటి ఘటనే...
మానసిక ఒత్తిడి తీవ్రమయ్యే దశలో.. కొందరికి చివరకు మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. మరికొందరు ఒత్తిడిని భరించలేక చివరకు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఢిల్లీ పరిధిలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆమె భర్త నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న భార్య.. చివరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. నా కూతుర్ని నువ్వే చూసుకో.. అంటూ తల్లికి రాసి ఆమె చేసిన పని.. స్థానికులందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ పరిధిలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్ సెక్టార్ 11లోని ఓ అద్దె ఇంట్లో 32ఏళ్ల మహిళ.. పదేళ్ల కూతురితో కలిసి నివాసం ఉంటోంది. ఈమె భర్త నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి భార్యకు సమస్యలు తలెత్తాయి. ఇంటి పెద్ద లేకపోవడంతో ఆర్థికంగానూ ఆమెను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. మరోవైపు తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఆమెకు జీవితంపైనే విరక్తి పుట్టింది. ఈ క్రమంలో ఆమె బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
పెరుగు తేవడానికి వెళ్లిన భర్త.. ఇంటికి చేరుకునేలోపు లోపలి నుంచి కటింగ్ మిషన్ శబ్ధాలు.. తీరా కిటికీ తలుపు తీసి చూస్తే..
నా కూతురిని నువ్వే చూసుకో.. అంటూ తల్లికి లేఖ రాసి, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు.. లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.