Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫోన్ చేసి మరీ ఇంటికి పిలిచింది.. అతడు నగ్నంగా మారిన మరుక్షణమే తలుపు తట్టిన శబ్దం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

చాలా మంది ఫోన్లకు అప్పడుప్పుడూ రాంగ్ నంబర్లు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కొందరు పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. ఆ పరిచయాలు కొన్నిసార్లు చాలా వరకూ వెళ్తుంటాయి. కొన్ని ప్రేమ వరకూ వెళ్లి ఆగిపోతే, మరికొన్ని పెళ్లి వరకూ వెళ్తుంటాయి. అయితే గుజరాత్‌లో ఓ వ్యక్తికి వచ్చిన ఫోన్ కాల్ చాలా వరకు వెళ్లింది. ఫోన్ లిప్ట్ చేయగానే అటువైపు ఓ యువతి వాయిస్ వినపడింది. వెంటనే పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజు ఆమె ఏకంగా.. ఇంటికే రమ్మని పిలిచింది. ఇంట్లోకి వెళ్లగానే అర్ధనగ్నంగా మార్చింది. అప్పుడే ఎవరో తలుపు తడుతున్నట్లు శబ్ధం.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం..

గుజరాత్‌లోని జోడయా-రస్నాల్ గ్రామానికి చెందిన హర్షద్ కేశవ్‌జీ పదో తరగతి వరకు చదువుకున్నాడు. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి సెల్‌కు ఓ రోజు రాంగ్ నంబర్ వచ్చింది. అటువైపు నుంచి హలో అంటూ ఓ మహిళ వాయిస్ వినిపించింది. దీంతో వెంటనే మాటలు కలిపాడు. ఇలా రోజూ ఆమె నుంచి ఫోన్ వచ్చేది. ఫోన్ రావడమే ఆలస్యం.. పనులన్నీ పక్కనబెట్టి ఫోన్‌లో మాట్లాడుతూ గడిపేవాడు. ఇలా వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. ఇలా రోజూ మాట్లాడుకునే క్రమంలో.. ఓసారి ఆమె ఇంటికి రమ్మని పిలిచింది. దీంతో వెంటనే ఆమె చెప్పిన చోటికి వెళ్లాడు.

అక్కడికి వెళ్లగానే మహిళ ఒక్కటే ఇంట్లో ఉంది. లోపలికి పిలిచి తలుపులు వేసింది. అతడికి మాయ మాటలు చెబుతూ అర్ధనగ్నంగా మార్చింది. అతడు కూడా ఆమె మాటలు నమ్మి.. చెప్పినట్లే చేశాడు. అర్ధనగ్నంగా మారిన మరుక్షణమే.. ఎవరో తలుపులు బాదుతున్నట్లు శబ్ధం వచ్చింది. ఆ వ్యక్తి కంగారు పడేలోపే ఆమె వెళ్లి తలుపు తీసింది. లోపలికి వచ్చిన నలుగురు వ్యక్తులు.. ‘‘మా మేనకోడలినే వేధిస్తావా’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4లక్షలు ఇవ్వాలని, లేదంటే వేధింపుల కేసు పెడతామని బెదిరించారు. భయపడిన ఆ వ్యక్తి  రూ.1.50వేలు సమర్పించుకున్నాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజ్‌కోట్‌కు చెందిన జిన్నాత్ అలియాస్ బేబీ రఫీక్ మక్వానా, హంసా సింధుభాయ్ అఘోలా, విహా లక్ష్మణ్ కటారియా, ఓ గుర్తుతెలియని కలిసి ముఠాగా ఏర్పడి ఇలా మోసాలు చేస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement