Viral Video: పులి బోనులో ఉంది కదా అని.. చక్కిలిగింతలు పెట్టాడు.. ఇంతలో అనుకోని ఘటన.. అయితే టైం బాగుండడంతో..

ABN , First Publish Date - 2022-07-07T01:26:23+05:30 IST

అడవిలో ఉన్న పులిని, చూడటానికే భయపడతారు. అదే పులి బోనులో ఉంటే మాత్రం.. ఆడుకోవాలని చూస్తారు. అయితే కొందరు ఆకతాయిల చేష్టలు కొన్నిసార్లు రివర్స్ అవుతుంటాయి..

Viral Video: పులి బోనులో ఉంది కదా అని.. చక్కిలిగింతలు పెట్టాడు.. ఇంతలో అనుకోని ఘటన.. అయితే టైం బాగుండడంతో..

అడవిలో ఉన్న పులిని, చూడటానికే భయపడతారు. అదే పులి బోనులో ఉంటే మాత్రం.. ఆడుకోవాలని చూస్తారు. అయితే కొందరు ఆకతాయిల చేష్టలు కొన్నిసార్లు రివర్స్ అవుతుంటాయి. బోనులో ఉన్న క్రూర జంతువులతో తమాషా చేసి, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు.. ప్రాణాలు పోయిన ఘటనలు చాలా చూశాం. ప్రస్తుతం ఓ ఆకతాయికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులి బోనులో ఉంది కదా అని.. ఏకంగా చేయి లోపలికి పెట్టి చక్కిలిగింతలు పెట్టాడు. అయితే ఆ సమయంలో అనుకోని ఘటన జరిగింది. అయితే టైం బాగుండడంతో బతికిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది..


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. జూలో బోనులో ఉన్న పలి వద్దకు ఓ వ్యక్తి వెళ్తాడు. చూసి వచ్చేయకుండా.. తన ఆకతాయి చేష్టలను బయటపెట్టాడు. పులి పడుకుని ఉంది కదా అని.. చేయి లోపలికి పెట్టి చక్కిలిగింతలు పెడతాడు. అయితే పులి పరధ్యానంలో ఉండడంతో పట్టించుకోదు. దీంతో ఆ వ్యక్తి మరింత రెచ్చిపోతాడు. దాని చెవులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో చేయిని బలవంతంగా లోపలికి తోస్తాడు. అయితే ఈ క్రమంలో చేయి కడ్డీల మధ్య ఇరుక్కుపోతుంది. దీంతో అతడికి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. వామ్మో! చచ్చాన్రా... దేవుడా.. అనుకుంటూ ఎలాగోలా పెనుగులాడి, చేయిని బయటికి తీసుకుంటాడు. ఆ సమయంలో పులికి ఏమాత్రం కోపం వచ్చినా.. పెద్ద ప్రమాదం జరిగుండేది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న యువతులను చూసి కామెంట్ చేశాడు.. చివరకు వాళ్ల రియాక్షన్ చూసి ఖంగుతిన్న యువకుడు..





Updated Date - 2022-07-07T01:26:23+05:30 IST