పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ప్రేమించింది.. ఓ రోజు ప్రియుడు పిలవడంతో ఊరి బయటకు వెళ్లింది.. తీరా చూస్తే..

ABN , First Publish Date - 2022-05-19T16:25:30+05:30 IST

అతడో పోలీసు కానిస్టేబుల్.. దీంతో అతడిపై అందరికీ ఎంతో నమ్మకం ఉండేది. అతడు ఏం చెప్పినా ప్రజలంతా వినేవారు. అలాగే ఓ బాలిక కూడా అతడి మాటలు బాగా నమ్మింది. అందులోనూ...

పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ప్రేమించింది.. ఓ రోజు ప్రియుడు పిలవడంతో ఊరి బయటకు వెళ్లింది.. తీరా చూస్తే..

అతడో పోలీసు కానిస్టేబుల్.. దీంతో అతడిపై అందరికీ ఎంతో నమ్మకం ఉండేది. అతడు ఏం చెప్పినా ప్రజలంతా వినేవారు. అలాగే ఓ బాలిక కూడా అతడి మాటలు బాగా నమ్మింది. అందులోనూ పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో కానిస్టేబుల్‌ను ప్రేమించింది. పెద్దలకు తెలీకుండా ప్రియుడితో రోజూ మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు ఊరి బయటికి రమ్మని పిలవడంతో వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే...


ఉత్తరప్రదేశ్ అలీఘర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న లఖేంద్ర సింగ్‌ అనే యువకుడు పీఏసీ 28 బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కానిస్టేబుల్ కావడంతో అంతా ఇతడిని గౌరవమర్యాదలతో చూసేవారు. అతడు ఏం చెప్పినా నిజమని నమ్మేవారు. ఈ క్రమంలో అతడు ఓ బాలికపై కన్నేశాడు. రోజూ మాయమాటలు చెప్పి ఆమెను పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో బాలిక కూడా అతడిని ప్రేమించింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా అతడితో రోజూ మాట్లాడుతూ ఉండేది. ఇలావుండగా గత నెలలో ఓ రోజు బాలికకు ఫోన్ చేసి, ఊరి బయటకు రమ్మని పిలిచాడు. అప్పటికే అతడిని బాగా నమ్మిన బాలిక.. పిలవగానే ఆలోచించకుండా వెళ్లిపోయింది.

ఇక నుంచి తప్పు చేయనంటూ భార్యను నమ్మించాడు.. మరుసటి రోజు రాత్రి అన్నతో పాటూ భార్య గదికి వెళ్లి..


తీరా అక్కడికి వెళ్లాక ప్రియుడితో పాటూ మరో వ్యక్తి ఉండడాన్ని చూసి షాక్ అయింది. వెళ్లీవెళ్లగానే ఇద్దరూ బాలిక నోరు మూసి, సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. బయట ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో అప్పటి నుంచి బాలిక మౌనంగా ఉండిపోయింది.  అయితే వారం క్రితం ఉన్నట్టుండి వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. కుటుంబ సభ్యులు గట్టిగా అడగడంతో జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం  కానిస్టేబుల్, అతని స్నేహితుడిని అరెస్ట్ చేశారు.

పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌ను మర్నాడు ఓపెన్ చేసి చూసిన వరుడికి దిమ్మతిరిగే షాక్.. ఆ గిఫ్ట్‌ను ఇచ్చిందెవరో తెలిసి..

Updated Date - 2022-05-19T16:25:30+05:30 IST