Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీపై నాకు విరక్తి పుట్టిందంటూ చెప్పిన భార్య.. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన భర్త.. చివరకు ఏం చేశాడంటే..

కుటుంబంలో ఎక్కువగా భర్తల వల్లే సమస్యలు తలెత్తుతుంటాయి. భర్త అక్రమ సంబంధాలు బయటపడడం, తద్వారా గొడవలు పడడం, చివరకు భార్యలపై దాడి చేయడం వంటివి ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే బీహార్‌లో జరిగిన ఘటన గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. పెళ్లయ్యాక సంతోషంగా సంసారం చేయాలని మహిళలకు ఉంటుంది. కానీ ఈమెకు మాత్రం పెళ్లయిన కొన్ని నెలలకే భర్తపై విరక్తి పుట్టిందట. నువ్వంటే నాకు ఇష్టం లేదు.. నేను వేరే పెళ్లి చేసుకుంటా.. అంటూ డైరెక్ట్‌గా భర్తకే చెప్పేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఏం చేశాడంటే..

బీహార్ భగల్‌పూర్ బిగుసరై ప్రాంతానికి చెందిన రణ్‌ధీర్‌కు సమీపంలోని ఖగాడియా పరిధి పరమానంద్‌పూర్ గ్రామానికి చెందిన రాధ అనే యువతికి 2018లో వివాహమైంది. ఇద్దరూ ఇష్టపడడంతో సంసారం సాఫీగా సాగేది. ఎలాంటి అలమరికలు లేకుండా సంతోషంగా ఉండేవారు. భర్త విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తుండడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. ఈ పరిస్థితిల్లో ఏ భార్య అయినా సంతోషంగా ఉంటుంది. కానీ ఈ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కొన్ని నెలలు గడిచాక.. నీపై నాకు విరక్తి పుట్టింది.. నువ్వంటే అసలు ఇష్టం లేదు.. నేను వేరే పెళ్లి చేసుకుంటా.. అని మొఖం ముందే చెప్పేసింది.

అంతవరకూ బాగున్న భార్య.. ఒక్కసారిగా ఇలా చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. సరదాగా అంటుందిలే అనుకుని సర్దుకున్నాడు. కానీ రోజూ ఇదే మాట చెబుతూ వేధించేది. మరోవైపు అత్త కూడా ఇదే రకంగా మాట్లాడటం మొదలెట్టింది. మా కూతురికి విడాకులు ఇవ్వు.. వేరే పెళ్లి చేయాలి.. అంటూ బెదిరించేవారు. ఈ విషయంలో అతను రోజురోజుకూ మానసికంగా కుంగిపోయేవాడు. కొన్నాళ్ల తర్వాత భార్య పుట్టింటికి వెళ్లింది. అక్కడి నుంచి రోజూ ఫోన్లు చేస్తూ బెదిరించేవారు. ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక, అలాగని లోలోపల భరించలేక.. సతమతమయ్యేవాడు.

ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి రణ్‌ధీర్ తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు ఫోన్ స్విచాఫ్ అని వస్తుండడంతో తండ్రి నేరుగా ఇంటికే వచ్చేశాడు. గది తలుపులు తట్టినా ఎవరూ తీయకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంటి పక్క వారు అక్కడికి చేరుకుని, అంతా కలిసి తలుపు బద్దలుకొట్టి వెళ్లారు. లోపల ఉరికి వేలాడుతూ ఉన్న కొడుకును చూసి.. తండ్రి బోరున విలపించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో విషయం మొత్తం రాసి ఉండడంతో.. అంతా షాక్ అయ్యారు. ఊహించని ఈ ఘటనతో స్థానికంగా విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement