ఇక నుంచి తప్పు చేయనంటూ భార్యను నమ్మించాడు.. మరుసటి రోజు రాత్రి అన్నతో పాటూ భార్య గదికి వెళ్లి..
ABN , First Publish Date - 2022-05-19T13:50:43+05:30 IST
వివాహ బంధం అనేది ఎంతో పవిత్రమైనది. అప్పటి వరకూ ఎవరో తెలీని వారు పెళ్లి అనే పేరుతో దంపతులుగా మారి.. జీవితాంతం అదే ప్రేమ, అభిమానాలతో జీవిస్తారు. అయితే...
వివాహ బంధం అనేది ఎంతో పవిత్రమైనది. అప్పటి వరకూ ఎవరో తెలీని వారు పెళ్లి అనే పేరుతో దంపతులుగా మారి.. జీవితాంతం అదే ప్రేమ, అభిమానాలతో జీవిస్తారు. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని, నిత్యం కలహాలతో కాపురం చేస్తుంటారు. మరికొందరైతే విడాకులు తీసుకునే వరకూ వెళ్తుంటారు. ఇంకొందరైతే సభ్యసమాజం తలదించుకునే పనులు చేస్తూ.. అందరితో ఛీకొట్టించుకంటూ ఉంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త ఇలాంటి పనే చేశాడు. ఇక నుంచి తప్పు చేయనంటూ భార్యను నమ్మించి, చివరకు అన్నతో కలిసి అతడు చేసిన పని.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ గ్వాలియర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 26ఏళ్ల యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు బాగా చూసుకున్న భర్త.. కొన్ని నెలల అనంతరం విచిత్రంగా ప్రవర్తించేవాడు. అసహజ పద్ధతిలో శృంగారం చేయాలని భార్యను ఒత్తిడి చేసేవాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో అత్త, బావ తదితరులు కూడా భర్తకే మద్దతు పలికారు. కొన్నాళ్ల తర్వాత భర్తతో పాటూ ఆమె బావ కూడా అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. కొన్నాళ్లు మౌనంగా భరించినా.. వారిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.
పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌ను మర్నాడు ఓపెన్ చేసి చూసిన వరుడికి దిమ్మతిరిగే షాక్.. ఆ గిఫ్ట్‌ను ఇచ్చిందెవరో తెలిసి..
ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్య దగ్గరికి వెళ్లి ’’ఇకనుంచి తప్పు చేయను, బాగా చూసుకుంటాను’’.. అని నమ్మించడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు అన్నతో పాటూ ఫుల్‌గా మందు తాగి భార్య గదికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, రెండేళ్లుగా తరచూ అత్యాచారానికి పాల్పడేవారు. భర్త, బావతో పాటూ వారి బంధువులు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవారు. వారి వేధింపులు భరించలేక.. ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి భర్త, అతడి సోదరుడు, మరికొంతమందిని అరెస్ట్ చేశారు.