విపరీతంగా మద్యానికి అలవాటు పడిన భార్య.. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేకపోవడంతో ఆ భర్త ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-06-30T00:32:32+05:30 IST
చాలా కుటుంబాల్లో భర్త దురలవాట్లకు బానిస కావడం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. మద్యానికి అలవాటు పడే కొందరు భర్తలు.. ఇంటికొచ్చి వివిధ సాకులు చూపుతూ భార్యలను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఇలాంటి..
చాలా కుటుంబాల్లో భర్త దురలవాట్లకు బానిస కావడం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. మద్యానికి అలవాటు పడే కొందరు భర్తలు.. ఇంటికొచ్చి వివిధ సాకులు చూపుతూ భార్యలను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. అయితే ఢిల్లీలో ఇటీవల ఓ కుటుంబంలో తలెత్తిన సమస్య ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఆ కుటుంబంలో భార్య.. తాగుడుకు అలవాటు పడడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. రోజూ ఫుల్‌గా మద్యం తాగి.. ఇంటికి కూడా సక్రమంగా రాకపోవడంతో, పద్ధతి మార్చుకోవాలని ఆమె భర్త హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో చివరికి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
దక్షిణ ఢిల్లీలోని మైదాన్ గర్హి పరిధి.. అసోలా ప్రాంతంలో సునిల్ కుమార్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. సునిల్ కుమార్, అతని సోదరుడు చోటూ కలిసి స్థానికంగా ఉన్న మార్కెట్‌లో సరుకులు విక్రయిస్తుంటారు. ఇదిలావుండగా, సునిల్ కుమార్ భార్యకు కొన్నేళ్లుగా మద్యం తీసుకునే అలవాటు ఉంది. ఈ అలవాటు ఇటీవల ఎక్కువైంది. రోజూ అతిగా మద్యం సేవించడం, ఎక్కువ సేపు బయటి ప్రాంతాల్లోనే గడపడంతో భర్తకు చిరాకు వచ్చింది. పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు చెప్పాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీనికితోడు మద్యం తాగే క్రమంలో వేరే యువకులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానం కూడా ఎక్కువైంది. దీంతో ఎలాగైనా తన భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సోదరుడు చోటూకు విషయం తెలియజేశాడు.
కొన్ని నెలల అనంతరం భార్యను చూసేందుకు ఇంటికొచ్చిన భర్త.. తన విషయం బయట చెబితే చంపేస్తానన్న భార్య.. చివరకు ఏం చేసిందంటే..
ఇద్దరూ మాట్లాడుకుని పక్కా పథకం ప్రకారం ప్లాన్ చేశారు. జూన్ 14న భార్యను బయటికి తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చే క్రమంలో అడవి గుండా వెళదామంటూ తీసుకెళ్లాడు. అడవి మధ్యలోకి వెళ్లగానే సోదరుడు చోటూతో కలిసి భార్యను గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని అడవిలోనే పడేసి, ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన భార్య జూన్ 13 తేదీ నుంచి కనపడడం లేదని ఫిర్యాదు చేశాడు. అయితే ఇన్నాళ్లు ఫిర్యాదు చేయడానికి ఎందుకు రాలేదనే అనుమానం రావడంతో.. వివిధ కోణాల్లో విచారించారు. దీంతో చివరికి విషయం మొత్తం బయటపడింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న చోటూ కోసం గాలిస్తున్నారు.