పిల్లలు పుట్టకుంటే మాత్రం.. కట్టుకున్న భార్యను ఎవరైనా ఇలా చేస్తారా.. ఈ శాడిస్టు భర్త చేసిన పనేంటంటే..

ABN , First Publish Date - 2022-04-11T16:05:20+05:30 IST

దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన కొందరు.. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని, రోజూ గొడవపడుతుంటారు. మందుకు బానిసై భార్యలను...

పిల్లలు పుట్టకుంటే మాత్రం.. కట్టుకున్న భార్యను ఎవరైనా ఇలా చేస్తారా.. ఈ శాడిస్టు భర్త చేసిన పనేంటంటే..
ప్రతీకాత్మక చిత్రం

దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన కొందరు.. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని, రోజూ గొడవపడుతుంటారు. మందుకు బానిసై భార్యలను వేధించేవారు కొందరుంటే.. అనుమానంతో చిత్రహింసలు పెట్టేవాళ్లు కొందరుంటారు. ఇంకొందరైతే, సంతానం కలుగలేదంటూ.. ఆ కోపాన్నంతా భార్యలపై చూపిస్తుంటారు. వైద్య పరీక్షలు చేయించుకుని, సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి.. వేధించడమే పనిగా పెట్టుకుంటుంటారు. తాజాగా కర్నాటకలో ఓ భర్త చేసిన పని సంచలనం కలిగించింది. పిల్లలు పుట్టలేదనే కారణం చూపిస్తూ రోజూ భార్యతో గొడవ పెట్టుకునేవాడు. ఓ రోజు ఇదే విషయమై భార్యతో గొడవపడి.. చివరికి ఏం చేశాడంటే..


కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఇండి తాలూకా పరిధి కెరవర గ్రామానికి చెందిన వీరేష్, సునంద దంపతులు. వీరికి 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరేష్ ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వీరికి ఎలాంటి ఆర్థిక సమస్యలూ  లేకపోవడంతో సంసారం సాఫీగా సాగేది. అయితే ఏళ్లు గడిచే కొద్దీ.. వీరేష్‌కు మాత్రం భార్యపై విరక్తి కలుగుతూ వచ్చింది. పిల్లలు పుట్టడం లేదంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. కనీసం వైద్య పరీక్షలు చేయించుకుని సమస్య పరిష్కరించుకోవాల్సింది పోయి... ఏవేవో సాకులు చూపి, నిత్యం వేధిస్తుండేవాడు. గత శుక్రవారం కూడా ఇదే విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. భార్య ఎదురు ప్రశ్నించడంతో వీరేష్ ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు.

నిన్ను తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను.. అని అనడంతో ప్రియుడు ఏం చేసినా కాదనలేదు.. ఓ రోజు అతడి గురించి విచారించగా..


భార్యను దుర్ఛాషలాడుతూ తీవ్రమైన కోపంతో ఒక్కసారిగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. గట్టిగా గొంతు నులమడంతో ఊపిరాడక సునంద మృతి చెందింది. దీంతో వీరేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సునంద మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.

చెరువు గట్టు వద్ద.. ఈ ఆరుగురు బాలికలు కలిసి.. చివరికి ఇంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు...

Updated Date - 2022-04-11T16:05:20+05:30 IST