నిన్ను తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను.. అని అనడంతో ప్రియుడు ఏం చేసినా కాదనలేదు.. ఓ రోజు అతడి గురించి విచారించగా..
ABN , First Publish Date - 2022-04-11T14:11:10+05:30 IST
కొందరు చెప్పే మాటలు వినడానికి నిజమేమో అన్నట్లుగా ఉంటాయి. అయితే మనసులో ఒకటి, బయటికి ఒకటి మాట్లాడుతున్నారనే విషయం.. ఆలస్యంగా తెలుస్తుంది...
కొందరు చెప్పే మాటలు వినడానికి నిజమేమో అన్నట్లుగా ఉంటాయి. అయితే మనసులో ఒకటి, బయటికి ఒకటి మాట్లాడుతున్నారనే విషయం.. ఆలస్యంగా తెలుస్తుంది. నేటి సమాజంలో ఇలాంటి వారు ఎక్కడ చూసినా దర్శనమిస్తూ ఉంటారు. పొరపాటున వారి మాటలు నమ్మితే.. చివరికి మోసపోవడమో లేక మానప్రాణాలు పోవడమో జరుగుతుంది. బీహార్‌లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ‘‘నువ్వంటే ఇష్టం.. నిన్ను తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను’’.. అని అనడంతో యువతి పూర్తిగా నమ్మి, సహజీవనం చేసింది. అయితే అనుమానం వచ్చి ఓ రోజు అతడి గురించి విచారించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది..
బీహార్ రాష్ట్రం జాముయ్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ యాదవ్ అనే వ్యక్తి.. సమీప ప్రాంతానికి చెందిన ఓ యువతిపై కన్నేశాడు. రోజూ ఆమెనే ఫాలో అవుతూ ఉండేవాడు. ఓ రోజు ఆమె వద్దకు వెళ్లి ‘‘నువ్వంటే ఇష్టం.. నిన్ను తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను’’... అని చెప్పేశాడు. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ యువతి మొదట అంగీకరించలేదు. అయినా ఆ వ్యక్తి మాత్రం రోజూ ఆమెనే వెంబడిస్తూ.. పదే పదే అవే మాటలు చెబుతుండేవాడు. దీంతో కొన్నాళ్లకు అతడు చెప్పే మాటలను ఆమె పూర్తిగా నమ్మింది. తర్వాత అతడు పిలిచిన ప్రాంతానికి వెళ్లింది. ఆమె బలహీనతను అవకాశంగా తీసుకుని రోజూ రాసలీలలు సాగించేవాడు. తర్వాత అతడితో సహజీవనం చేయడానికి అంగీకరించింది. ఇలా రోజూ అతడి చెప్పిందల్లా చేసేది. అయితే రోజులు గడుస్తున్నా.. పెళ్లి ప్రస్తావన మాత్రం తేవడం లేదు.
పరీక్షలంటే భయమేసి.. ప్రియుడిని పిలిచి పారిపోదామని చెప్పింది.. అయితే దారి మధ్యలో అతడు ప్లాన్ మార్చడంతో...
దీంతో కొన్ని రోజుల అనంతరం యువతి అతడిని ప్రశ్నించింది. ‘‘నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్’’.. అంటూ నిలదీసింది. అయితే ‘‘కొన్నాళ్లు సమయం కావాలి’’.. అంటూ రోజూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఇలా తరచూ ఏవేవో సాకులు చెప్పి, వాయిదా వేస్తుండడంతో యువతికి అనుమానం కలిగింది. అతడికి తెలీకుండా విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తికి అప్పటికే వివాహమై.. నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దీంతో మోసపోయానని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.