ఈ కోతి ఎంత పని చేసింది.. తలుపులు వేయని ఇంట్లోకి చొరబడి.. నిద్రపోతున్న పిల్లాడిని ఎత్తుకెళ్లి..

ABN , First Publish Date - 2022-01-10T23:40:59+05:30 IST

వస్తువులు ఎత్తుకెళ్లే కోతులు.. చిన్న పిల్లలను కూడా ఎత్తుకెళ్తాయని ఎవరూ ఊహించరు. కానీ ఉత్తరప్రదేశ్‌లో అలాగే జరిగింది. తలుపులు వేయని ఓ ఇంట్లోకి కోతి చొరబడింది..

ఈ కోతి ఎంత పని చేసింది.. తలుపులు వేయని ఇంట్లోకి చొరబడి.. నిద్రపోతున్న పిల్లాడిని ఎత్తుకెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం

ఇళ్ల సమీపంలో కోతులు కనపడితే చాలు.. బయటకెక్కడా వస్తువులు లేకుండా సర్దుకుంటాం. ఎప్పుడు ఏ కోతి వచ్చి.. ఏ వస్తువు ఎత్తుకుపోతుందో అనే భయంతో ఉంటారు. కొన్నిసార్లు వాటి బెడద తట్టుకోలేక.. అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా చాలా చూశాం. వస్తువులు ఎత్తుకెళ్లే కోతులు.. చిన్న పిల్లలను కూడా ఎత్తుకెళ్తాయని ఎవరూ ఊహించరు. కానీ ఉత్తరప్రదేశ్‌లో అలాగే జరిగింది. తలుపులు వేయని ఓ ఇంట్లోకి కోతి చొరబడింది. మేడపై నానమ్మ వద్ద నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లింది. తర్వాత జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. 


ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లోని బాగ్‌పట్‌లో కోమల్, ప్రిన్స్ అనే భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. ఈ మధ్యే చిన్నారికి కేశవ్ అనే పేరు పెట్టారు. కోమల్ తల్లికి మనువడు అంటే చాలా అభిమానం. రోజూ చిన్నారిని లాలిస్తూ ఉండేది. రాత్రిళ్లు కూడా తన పక్కనే పడుకోబెట్టుకునేది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వారి మేడపై నానమ్మ వద్ద చిన్నారి నిద్రపోతున్నాడు. తలుపులు వేయకుండా పడుకోవడం వల్ల ఇంత దారుణం జరుగుతుందని వారు ఊహించలేకపోయారు. మేడపైకి వెళ్లిన కోతులు ఇంట్లోకి ప్రవేశించాయి. బాబును ఎత్తుకుని బయటికి వెళ్లాయి.

ఈ కుక్కల వాలీబాల్ గేమ్ మామూలుగా లేదుగా.. అచ్చం మనుషుల్లాగే ఆడుతున్నాయే..


చిన్నారి ఏడుపులతో వృద్ధురాలు అప్రమత్తమైంది. వాటిని తరమికొట్టే ప్రయత్నం చేసినా వీలు కాలేదు. ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో చిన్నారి తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ కోతి చిన్నారిని ఎత్తుకెళ్లి పక్కనే వాటర్ ట్యాంక్‌లో పడేశాయి. చూస్తుండగానే తమ కుమారుడు నీళ్లలో పడిపోవడంతో వారంతా కుప్పకూలిపోయారు. అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే చిన్నారి ఊపిరాడక మృతి చెందాడు. గతంలో కూడా ఓసారి చిన్నారిని కోతులు ఎత్తుకెళ్లాలని చూశాయని, అయితే గమనించి కాపాడుకున్నామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కోతులే పొట్టనపెట్టుకుంటాయని ఊహించలేదని బోరున విలపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ ఫుటేజీ పరిశీలించారు. కోతుల కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు.

ఆ కుక్కంటే యజమానికి చాలా ఇష్టం.. ఇంట్లో ఉంచుకోవద్దన్న తల్లి.. కుక్కను వదిలి ఉండలేక చివరకు..

Updated Date - 2022-01-10T23:40:59+05:30 IST