వాసన వస్తోందేంటని అడిగిన మరిది.. ఎలుక చచ్చిందన్న వదిన.. బాత్రూంలో భర్త శవాన్ని దాచి ఓ భార్య నిర్వాకమిదీ..!
ABN , First Publish Date - 2022-06-28T22:00:15+05:30 IST
కొందరు ఎన్ని నేరాలు చేసినా.. పైకి మాత్రం అమాయకుల్లా కనిపిస్తుంటారు. తీరా, అసలు నిజాలు వెలుగులోకి వచ్చాక.. వామ్మో! అని అంతా షాక్ అవుతుంటారు. హర్యానాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు..
కొందరు ఎన్ని నేరాలు చేసినా.. పైకి మాత్రం అమాయకుల్లా కనిపిస్తుంటారు. తీరా, అసలు నిజాలు వెలుగులోకి వచ్చాక.. వామ్మో! అని అంతా షాక్ అవుతుంటారు. హర్యానాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. అన్న ఇంటికి వచ్చిన తమ్ముడు.. ఏంటీ! ఏదో చెడు వాసన వస్తోందే.. అని వదినను అడిగాడు. ఏం లేదు.. ఏదో ఎలుక చచ్చినట్లు ఉందంటూ.. ఆమె బుకాయించింది. బాత్రూంలో భర్త శవాన్ని దాచిన భార్య.. చివరకు ఏం చేసిందంటే..
హర్యానా రాష్ట్రం అవబాలా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూపీకి చెందిన రోహతాష్(32) అనే వ్యక్తి.. అవబాలా జిల్లా ఘాసిత్‌పూర్ అనే ప్రాంతంలో భార్య కమలేష్‌తో కలిసి నివాసం ఉండేవాడు. మూడు, నాలుగు రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నుంచి రోహతాష్ అనిపించకుండాపోయాడు. దీంతో అతడి తల్లిదండ్రులు తెలిసిన ప్రాంతాల్లో విచారించారు. అయినా ఫలితం లేదు. సోమవారం రోహతాష్ సోదరుడు ఇందర్‌పాల్.. యూపీ నుంచి అన్న ఇంటికి వచ్చాడు. అయితే ఇంట్లోకి వెళ్లగానే.. దుర్వాసన రావడంతో వదినను అడిగాడు. ఏదో ఎలుక చచ్చినట్లు ఉందంటూ ఆమె బుకాయించింది.
రాత్రికి రాత్రే ఇంట్లోంచి అదృశ్యమైన అత్త, అల్లుడు.. కంగారుగా ఊరంతా వెతికిన భార్య.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ఈ క్రమంలో మంగళవారం గ్రామంలోని మురుగు కాలువలో రోహతాష్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రకి తరలించారు. వారి విచారణలో సంచనల నిజాలు వెలుగులోకి వచ్చాయి. రోహతాష్‌ను అతడి భార్యే హత్య చేసి, మృతదేహాన్ని మరుగుదొడ్డిలో రెండు రోజుల పాటు దాచిపెట్టిందని తెలిసింది. అనుమానం రాకుండా ఉండేందుకు మంగళవారం మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు తేలింది. దీంతో భార్యపై హత్య చేసు నమోదు చేసిన పోలీసులు.. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.