రాత్రి వేళ గ్రామంలోకి చొరబడ్డ సింహం.. అంతా భయపడినా ఓ మహిళ మాత్రం.. చివరకు ఏం తెలిసిందంటే..

ABN , First Publish Date - 2022-01-07T00:11:59+05:30 IST

సింహాన్ని టీవీల్లో చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది ఎదురుగా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాత్రి వేళ ఓ సింహం గర్జిస్తూ... గ్రామంలోకి చొరబడింది. దీంతో అంతా భయంతో వణికిపోయి, ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కానీ..

రాత్రి వేళ గ్రామంలోకి చొరబడ్డ సింహం.. అంతా భయపడినా ఓ మహిళ మాత్రం.. చివరకు ఏం తెలిసిందంటే..

సింహాన్ని టీవీల్లో చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది ఎదురుగా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాత్రి వేళ ఓ సింహం గర్జిస్తూ... గ్రామంలోకి చొరబడింది. దీంతో అంతా భయంతో వణికిపోయి, ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కానీ ఓ మహిళ మాత్రం ఏమాత్రం భయం లేకుండా దాని వద్దకు వెళ్లింది. అంతటితో ఆగకుండా దాన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లింది. చివరగా అసలు విషయం తెలిసి.. అంతా అవాక్కయ్యారు.


మిడిల్​ ఈస్ట్​ కంట్రీ కువైట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామంలోకి రాత్రి సమయంలో ఓ సింహం గర్జన పెడుతూ ప్రవేశించింది. దాన్ని చూసిన ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. కొందరు ఇళ్లపైకి వెళ్లగా, మరికొంత మంది లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అదే సమయంలో ఓ మహిళ మాత్రం తాపీగా దాని వద్దకు వెళ్లింది. అంతటితో ఆగకుండా దాన్ని చేతులతో నిమురుతూ చంటి బిడ్డను ఎత్తుకున్నట్లుగా తీసుకెని వెళ్లడం గమనించవచ్చు.

గుర్రంపై పెళ్లిమంటపానికి చేరుకున్న వరుడు.. రెండో అంతస్థులో వధువు.. కిటికీలోంచి చూసుకుని ఇద్దరి రియాక్షన్‌ను చూస్తే..


అయితే ఆమె నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుందే తప్ప.. ఆమెకు ఏమాత్రం హాని చేయలేదు. గ్రామస్తులు భయంతో సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నఅధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. ఆ సింహాన్ని సదరు మహిళ పెంచుకుంటోందని తెలియడంతో అంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

ఈ ఫొటోలో కనిపిస్తున్నది పురుషుడు కాదు.. మహిళ.. 43 ఏళ్లుగా గొంతు మార్చి మరీ మగాడిలా జీవనం.. కారణమేంటంటే..

Updated Date - 2022-01-07T00:11:59+05:30 IST