అన్నం తినడానికి ముందు.. ఆ తర్వాత.. అసలు నీళ్లు తాగొచ్చా..? తాగితే ఏమవుతుందంటే..

ABN , First Publish Date - 2021-12-22T19:51:47+05:30 IST

నీరు మన దేహానికి చాలా అవసరం. నీరు త్రాగనిదే మనం బ్రతకలేం. కానీ నీళ్లు ఎప్పుడు తాగాలో... ఎప్పుడు తాగకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది భోజనానికి ముందు తాగుతారు..

అన్నం తినడానికి ముందు.. ఆ తర్వాత.. అసలు నీళ్లు తాగొచ్చా..? తాగితే ఏమవుతుందంటే..

నీరు మన దేహానికి చాలా అవసరం. నీరు త్రాగనిదే మనం బ్రతకలేం. కానీ నీళ్లు ఎప్పుడు తాగాలో... ఎప్పుడు తాగకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది భోజనానికి ముందు తాగుతారు.. మరికొంత మంది తిన్నాక తాగుతారు. ఇలా చేయడం హానికరం అని అంటుంటారు. ఇదంతా తెలియక కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అస్సలు నీళ్లు ఎప్పుడు తాగాలి.. ఎప్పుడు తాగకూడదో తెలిస్తే సమస్యే ఉండదు. మరి దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రక్తాన్ని ద్రవరూపంలో ఉంచుతుంది. శరీరపు ఉష్ణోగ్రతను కాపాడుతుంది. మూత్రం ద్వారా చెడు పదార్థాలను వెలుపలకు పంపుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మంచినీళ్లు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే మంచినీళ్లు ఎప్పుడు తీసుకోవాలో... ఎప్పుడు తీసుకోకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 


భోజనానికి ముందు నీరు తాగడం వల్ల శరీరం బలహీనంగా మారిపోతుందని సూచిస్తున్నారు. అలాగే తిన్న వెంటనే నీరు ఎక్కువగా తాగడం వల్ల స్థూలకాయానికి కూడా దారితీస్తుందని అంటున్నారు. చాలా మంది తినేటప్పుడు నీళ్లు తాగడం అలవాటుగా పెట్టుకుంటారు. ఖాళీ సమయాల్లో తాగకుండా కేవలం భోజనం చేసేటప్పుడే నీళ్లు తాగుతుంటారు. ఇలా తినే  సమయంలో నీళ్లు తాగడం అనేది సరైన పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అంతగా ఇబ్బంది కలిగితే కొంచెం కొంచెంగానే తాగాలంటారు. అప్పుడు మాత్రమే జీర్ణక్రియ సజావుగా జరగడానికి వీలుంటుందని చెబుతున్నారు.


భోజనం చేసిన వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. భోజనం చేసిన వెంటనే నీళ్లు తీసుకోకూడదట. ఇది జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారు. తినే ముందు తిన్న తర్వాత కొంత విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. మనం భోజనం చేశాక తిన్నది జీర్ణం కావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఆహారం అన్నవాహిక ద్వారా కడుపునకు, ఆ తర్వాత మీ పెద్దప్రేగుకు వెళుతుంది. భోజనానికి ముందు నీటిని తీసుకుంటే తీసుకోబోయే ఆహారాన్ని కరిగించడం కంటే ద్రవ భాగానికి భంగం కలిగించినట్లు అవుతుంది. కనుక భోజనానికి ముందు నీరు తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు.


మరొక అధ్యయనం ప్రకారం.. భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగడం అంటే అది దుష్ప్రభావం అంటున్నారు. అన్నం తిన్నాక మంచినీళ్లు తాగితే ఆహారం జీర్ణం కావడానికి పట్టే సహజ సమయాన్ని తారుమారు చేసినట్లేనని సూచిస్తున్నారు. ఇలా తారుమారు కావడం వల్ల వేగంగా ఆకలిగా అనిపించేలా చేస్తుంది. దీంతో అతిగా తినడం వల్ల ఉబ్బరం కలిగిస్తుంది. అందుకే భోజనం తర్వాత కొంత గ్యాప్ అవసరమని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల అవసరమైన పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అలా కాకుండా భోజనం చేసిన వెంటనే నీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్ పలచన అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక భోజనం తర్వాత నీటిని ఎక్కువగా తీసుకోవడం జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను పలుచన చేస్తుంది. దీని వల్ల గుండెల్లో మంట మరియు ఆమ్లత్వానికి దారి తీస్తుంది. అంతేకాదు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


ఇక పండ్లు తిన్న వెంటనే నీళ్లు అస్సలు తాగకూడదంటున్నారు. ఎందుకంటే పండ్లలో 90 శాతం నీరు ఉంటుంది. అలాగే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా పండ్లలో షుగర్ కంటెంట్, సిట్రిక్ యాసిడ్‌లు ఉంటాయి. అందువల్ల పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదు. కనీసం గంట సమయమైనా గ్యాప్ ఇవ్వాలి. ఇక ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు.. దీని వల్ల డెంటల్ సమస్యలు రావొచ్చు. అలాగే చిగుళ్లు బలహీనపడతాయి. అంతేకాకుండా గొంతు నొప్పి సమస్య కూడా ఎక్కువ అవుతుంది. అందుకొరకే ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత కొంత సమయం గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగాలి. ఇక టీ లేదా కాఫీ ఏదైనా తాగాక నీరు అస్సలు తాగకూడదు. అలా చేస్తే జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. ఇక వేరుశెనగ తిన్న తర్వాత కూడా నీళ్లు అస్సలు తాగకూడదు. ఒకవేళ తిన్న వెంటనే తాగితే దగ్గు, గొంతు నొప్పి వస్తుంది.

Updated Date - 2021-12-22T19:51:47+05:30 IST