tragic incident: తాగుతూ తూలుతూ ఇంటికొచ్చిన భర్త.. అర్ధరాత్రవుతున్నా పదే పదే ఒకే విషయంలో భార్య వ్యతిరేకిస్తుండడంతో.. చివరకు..
ABN , First Publish Date - 2022-08-28T21:45:35+05:30 IST
భర్తోగ ఎన్ని దారుణాలు చేసినా చాలా మంది భార్యలు ఓపికతో భరిస్తుంటారు. భర్తే దైవంగా భావిస్తూ.. పిల్లల సంక్షేమం కోసం తమ జీవితాలను కూడా త్యాగం చేయడానికి వెనుకడారు..
భర్తోగ ఎన్ని దారుణాలు చేసినా చాలా మంది భార్యలు ఓపికతో భరిస్తుంటారు. భర్తే దైవంగా భావిస్తూ.. పిల్లల సంక్షేమం కోసం తమ జీవితాలను కూడా త్యాగం చేయడానికి వెనుకడారు. అయితే చాలా మంది భర్తలు.. కనీస ప్రేమను కూడా చూపకుండా, నిత్యం వివిధ సాకులు చూపుతూ భార్యలను వేధించడమే పనిగా పెట్టుకుంటుంటారు. కొందరు భార్యలు ఓపిక నశించిన సమయంలో తిరగబడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు (tragic incident) చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలు ఇటీవల రోజూ చూస్తునే ఉన్నాం. బీహార్లో తాజాగా.. ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తాగుతూ, తూలుతూ ఇంటికొచ్చిన భర్త.. అర్థరాత్రవుతున్నా పదే పదే విసిగిస్తుండడంతో చివరకు భార్య తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో చివరకు భర్త చేసిన దారుణం.. అందరికీ తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. వివరాల్లోకి వెళితే..
బీహార్ (Bihar) రాష్ట్రం నవాడా జిల్లా వారిస్లిగంజ్ పరిధి బర్నావా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోరిల్ మాంఝీ అనే వ్యక్తికి భార్య కిరణ్దేవి, 9 నెలల కుమార్తె ఉన్నారు. భర్త ఇటీవల మద్యానికి బానిస అయ్యాడు. రోజూ ఇంటికి తాగొచ్చి గొడవ గొడవ చేసేవాడు. కొన్నాళ్లు పోతే మార్పు వస్తుందని.. కిరణ్ దేవి ఓపికతో భరిస్తూ ఉండేది. అయినా భర్త ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో గురువారం విపరీతంగా మద్యం సేవించి.. తాగుతూ, తూలుతూ ఇంటికి వచ్చాడు. రోజూ చూసిన వ్యవహారమే కావడంతో.. భర్త రాగానే భోజనం వడ్డించింది. తిన్న తర్వాత నుంచి భార్య నిద్రపోకుండా విసిగించడం మొదలెట్టాడు. వివిధ సాకులు చూపి పదే పదే వేధిస్తుండడంతో చివరకు ఆమెకు ఓపిక నశించింది.
woman Missing: చెరువు ఒడ్డున చెప్పులు ఉండడంతో.. మహిళ కోసం రాత్రంతా వెతికిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. రెండు రోజుల తర్వాత జరిగిన ఘటనతో..
పుట్టింటికి వెళ్తున్నా అంటూ కూతురును ఎత్తుకుని బయటికి వెళ్లబోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. ఆమె వద్ద నుంచి కూతురును బలవంతంగా లాక్కుని, నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో ఆ పాప అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. లబోదిబోమంటూ స్థానికుల వద్దకు వెళ్లి విషయం తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, బీహార్లో మద్య నిషేధం అమల్లో ఉన్నా.. అక్రమంగా విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.