కోవిడ్-19 నిరోధంపై ఐటీబీపీ సిబ్బందికి డబ్ల్యూహెచ్ఓ శిక్షణ

ABN , First Publish Date - 2020-07-08T22:26:17+05:30 IST

కోవిడ్-19 నియంత్రణ, భద్రత నిబంధనలపై ఐటీబీపీ సిబ్బందికి డబ్ల్యూహెచ్ఓ

కోవిడ్-19 నిరోధంపై ఐటీబీపీ సిబ్బందికి డబ్ల్యూహెచ్ఓ శిక్షణ

న్యూఢిల్లీ : కోవిడ్-19 నియంత్రణ, భద్రత నిబంధనలపై ఐటీబీపీ సిబ్బందికి డబ్ల్యూహెచ్ఓ శిక్షణ ఇస్తోంది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను ఐటీబీపీ బుధవారం తెలిపింది. ఐటీబీపీ డాక్టర్లకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం జరుగుతుంది. 


ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) తెలిపిన వివరాల ప్రకారం, ఐటీబీపీ వైద్య సిబ్బందికి కోవిడ్-19 మహమ్మారి నిరోధం, భద్రతా నిబంధనలపై డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మంగళవారం మొదటి కార్యక్రమం జరిగింది. తదుపరి వైద్యులకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా కార్యక్రమం శుక్రవారం జరుగుతుంది. 


డబ్ల్యూహెచ్ఓ అధికారులు, సీనియర్ డాక్టర్లు అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా చేరినవారికి, జూనియర్లకు అత్యాధునిక టెక్నాలజీపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. 


తాజా సమాచారం ప్రకారం, 151 మంది ఐటీబీపీ సిబ్బంది కోవిడ్-19తో బాధపడుతున్నారు. 273 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. 



Updated Date - 2020-07-08T22:26:17+05:30 IST