రైలు చివరి కంపార్ట్‌మెంట్ వెనుక క్రాస్ గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దీని అర్థమేమిటంటే..

ABN , First Publish Date - 2022-01-17T17:43:23+05:30 IST

మీరు రైలులో ప్రయాణించేటప్పుడు..

రైలు చివరి కంపార్ట్‌మెంట్ వెనుక క్రాస్ గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దీని అర్థమేమిటంటే..

మీరు రైలులో ప్రయాణించేటప్పుడు రైలు బోగీలను గమనించేవుంటారు. అయితే రైలు చివరి కంపార్ట్‌మెంట్ వెనుక పెద్ద క్రాస్ గుర్తు ఉండటాన్ని మీరు గమనించేవుంటారు. ఈ గుర్తు కొన్ని రైళ్లకు పసుపు రంగులో, మరికొన్ని రైళ్లకు తెలుపు రంగులో ఉంటుంది. దీనిని మీరు ఎప్పుడూ గమనించి ఉండకపోతే ఈసారి రైలులో ప్రయాణించినప్పుడు దీనిని గమనించండి. ఇప్పుడు ఈ క్రాస్ గుర్తు కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైలుకు ఈ గుర్తును వేస్తారు. 


ఇది రైలు చివరి కంపార్ట్‌మెంట్ వెనుక ఉంటుంది. ఈ గుర్తు ఉంటే అది రైలు చివరి భాగమని సూచన. రైలు స్టేషన్ దాటిందని రైల్వే సిబ్బందికి ఇది సూచనలా ఉపయోగపడుతుంది. రైలు విజయవంతంగా ముందుకు సాగిందని రైల్వే క్రాసింగ్ వద్ద ఉన్న గార్డు ఈ గుర్తు ద్వారా తెలుసుకుంటాడు. ఈ గుర్తుతోపాటు చివరి బోగీ వెనుక రెడ్ లైట్ కూడా ఉంటుంది. రాత్రిపూట ఈ గుర్తు కనిపించేందుకు ఈ రెడ్ లైట్ సహాయపడుతుంది.

Updated Date - 2022-01-17T17:43:23+05:30 IST