Advertisement
Advertisement
Abn logo
Advertisement

నా భార్య గుట్కా తింటోంది.. వద్దని చెప్పినా వినట్లేదు.. భర్త చెప్పిన మాటలతో అవాక్కైన పోలీసులు.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: భార్యభర్తలకు సంబంధించిన చిన్న పంచాయితీ పోలీసు స్టేషన్ వరకూ వెళ్లింది. అక్కడ భార్య మాటలు విని.. భర్తపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకుని అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. చివరకు ఆ దంపతుల పంచాయితీ ఎంత వరకూ వెళ్లింది, అధికారులు ఏం చేశారు అనే వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని భగల్పూర్ జిల్లా, తోలాకు చెందిన ఓ వ్యక్తికి 2ఏళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత కొన్నాళ్లపాటు ఈ జంట అనోన్యంగానే ఉంది. అయితే తాజాగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పూర్ణియాలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌లో ఉన్న అధికారుల ముందు ఒకరి మీద మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. అదనపు కట్నం, మోటర్ సైకిల్ కోసం  చిత్రహింసలు పెడుతున్నాడని భార్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ భర్త ఇబ్బందులు కూడా తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారు. తన భార్య గుట్కాలు తింటోందని.. వద్దని ఎంత చెప్పినా మాట వినడంలేదని అందకే ఆమెపై చేయి చేసుకున్నట్టు చెప్పడంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అనంతరం అదనపు కట్నం, బైక్ కోసం భార్యను కొట్టొద్దని అతడిని హెచ్చరించారు. అంతేకాకుండా గుట్కాలు తినే అలవాటును మానుకోవాలని సదరు మహిళకు సూచించి.. ఆ దంపతులను ఇంటికి పంపించేశారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement