లాక్ డౌన్‌లో ఉద్యోగం దొరకదన్న వ్యక్తిని కొట్టి చంపిన భార్య!

ABN , First Publish Date - 2020-05-31T16:37:51+05:30 IST

లాక్ డౌన్ ఉద్యోగం దొరకద్దన్న భర్తను ఓ భార్య తన తల్లితో కలసి కొట్టి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో శనివారం జరిగింది.

లాక్ డౌన్‌లో ఉద్యోగం దొరకదన్న వ్యక్తిని కొట్టి చంపిన భార్య!

భోపాల్: లాక్ డౌన్ ఉద్యోగం దొరకద్దన్న భర్తను ఓ భార్య తన తల్లితో కలసి కొట్టి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో శనివారం జరిగింది. మధ్యప్రదేశ్ ఖండ్వా జిల్లాకు చెందిన రమేశ్ లక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. ఈ విషయంలో మే 24న రమేశ్‌కు అతడి భార్య లీలకు మధ్య వివాదం చెలరేగింది. కుటుంబాన్ని పోషించేందుకు ఉద్యోగం వెతుక్కోవాలని భార్య తేల్చిచెప్పింది. లాక్ డౌన్ సందర్భంగా ఉద్యోగం దొరకట్లేదని భర్త వాదించాడు. ఈ వాదన తీవ్ర రూపం దాల్చడంతో లీల తన తల్లితో కలసి భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో రమేశ్ ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో అతడి తల్లి, తమ్ముడు రమేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు శనివారం నాడు మృతి చెందాడు. భార్య దెబ్బలు తాళలేక అతడు మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు కారణమైన భార్యను ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే లీల కూడా భర్త తనను నరకయాతన పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-05-31T16:37:51+05:30 IST