మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. రాత్రి చిన్న గొడవ.. వేరు వేరుగా పడుకున్నారు.. తెల్లవారుజామున భర్త గదిలోకి వెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2021-09-14T02:21:12+05:30 IST
రాత్రి విడివిడిగా పడుకున్న భార్యాభర్తలు..తెల్లారేసరికి దారుణం
ఇంటర్నెట్ డెస్క్: మూడు నెలల క్రితం ఒకరికొకరు తారసపడ్డారు. ఆ తరువాత వారి మధ్య పరిచయం పెరిగింది. చివరికి అది ప్రేమగా మారింది. చివరికి వారు పెళ్లి చేసుకున్నారు. 20 రోజుల క్రితమే కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లైన తరువాత అప్పుడప్పుడూ వారి మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తుండేవి. శనివారం కూడా వారు చిన్న విషయంలో గొడవపడ్డారు. వేరు వేరు గదుల్లోకి వెళ్లి పడుకున్నారు. తెల్లారేసరికల్లా.. అతడు ఎన్నడూ ఊహించని దారుణం జరిగింది. అసలు ఎందుకిలా జరిగిందో అర్థంకాక అతడు కన్నీరుమున్నీరయ్యారు.. గ్వాలియర్‌లో సంచలనం కలిగిస్తున్న ఈ కేసు పూర్వాపరాలు ఏంటంటే..
గ్వాలియర్‌కు చెందిన 22 ఏళ్ల నేహా చౌహాన్ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఒక రోజు తమ కార్యాలయానికి వచ్చిన రాహుల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వారు పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. పెద్దలు ఈ వివాహానికి అంగీకరించకపోవడంతో.. వారు గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఆగస్టు 22న వారి వివాహం జరిగింది. అయితే..పెళ్లైన నాటి నుంచి వారి మధ్య అప్పుడప్పుడూ అభిప్రాయ బేధాలు పొడచూసేవి. ఇదే క్రమంలో శనివారం రాత్రి కూడా వారి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో.. వారు వేరు వేరు గదుల్లో వెళ్లి పడుకున్నారు. అర్ధరాత్రి 3.30 గంటలకు రాహుల్.. తన భార్య కోపం తగ్గిందో లేదో చూసేందుకు ఆమె గదికి వెళ్లాడు. ఆమె అటువైపు తిరిగి నిద్రపోతోంది. దీంతో అతడు వెనక్కు వచ్చేశాడు.
ఇవీ చదవండి..
నా కూతురు కనిపించడం లేదంటూ ఓ తండ్రి ఫిర్యాదు.. వెతికి పట్టుకున్న తర్వాత ఆమె చెప్పిన నిజాలు విని పోలీసులకు షాక్..
భార్యపై అనుమానం.. స్నేహితుల ముందే ఆమెను నడి రోడ్డుపై.. ఓ భర్త చేసిన నీచమిది..!
మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తరువాత మరోసారి ఆమె గదికి వెళ్లి చూస్తే ఆమె ఫ్యానుకు ఉరిపోసుకుని మరణించింది. దీంతో.. అతడు ఒక్కసారిగా షాకైపోయాడు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించాడు. తమ మధ్య చిన్న గొడవే జరిగిందని.. ఇంతలోనే భార్య ఇలాంటి నిర్ణయం తీసుకుని తన జీవితాన్ని తల్లకిందులు చేస్తుందని అస్సలు ఊహించలేదని అతడు పోలీసుల వద్ద కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఈ ఘటన వెనుక నిజానిజాలు వెలికి తీసేందుకు దర్యాప్తు ప్రారంభించారు.