Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్తతో సుఖం దొరకలేదని.. పరాయి మగవారిపై మనసు పడింది.. ఓ రోజు చెత్త ఏరుకునే వ్యక్తి ఇంట్లోకి రాగానే..

కట్టుకున్న భార్యను కలకాలం కాపాడాల్సింది పోయి.. అనుక్షణం ప్రత్యక్ష నరకం చూపించే భర్తలు చాలా మంది ఉంటారు. అలాగే భర్తే ప్రత్యక్ష దౌవం అనే ఆడవాళ్లు ఉన్న ఈ దేశంలో.. భర్తను హింసించే భార్యలు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకొందరైతే క్షణకాల సుఖం కోసం భర్తను కాదని పక్క చూపులు చూస్తూ.. చివరికి జీవితాన్ని సర్వనాశం చేసుకుంటూ ఉంటారు. తెలంగాణలోని షాద్‌నగర్‌లో ఓ మహిళ ఇలాగే చేసింది. భర్త తనను సుఖపెట్టలేదనే కారణంతో పరాయి మగవారిని ఆశించింది. ఓ రోజు చెత్త ఏరుకునే వ్యక్తి ఇంట్లోకి రావడంతో ఆమెలో కలగరాని కోరికలు కలిగాయి. చివరకు ఏమైందో తెలుసుకుందాం..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణం పటేల్ రోడ్డులో శంకర్, స్వాతి(పేర్లు మార్చాం) దంపతులు నివాసం ఉంటున్నారు. కష్టాన్నే నమ్ముకున్న శంకర్... కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ కష్టపడుతూ ఉంటాడు. ఇంట్లో భార్యకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవాడు. ఏ భార్యకు అయినా అంతకంటే కావాల్సింది ఏముంటుంది. కానీ ఆమెకు మాత్రం మనసులో ఏదో అసంతృప్తి ఉండేది. భర్త తనను బాగా చూసుకుంటున్నా.. శారీరకంగా మాత్రం సుఖపెట్టలేదనే ఆలోచనతో ఉండేది. కొన్నాళ్లకు ఈ ఆలోచన కాస్త.. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది.. అనే వరకూ వెళ్లింది. అయితే చుట్టు పక్కల వారితో సంబంధం పెట్టుకుంటే ఎప్పటికైనా దొరికిపోతాం.. ఎవరికీ అనుమానం రాకుండా, సుఖం అనుభవించాలని రోజూ ఆలోచిందేది.


మేనల్లుడని ఇంటికి పిలిస్తే అత్తతో అక్రమ సంబంధం.. రోజూ దొంగచాటుగా రాసలీలలు.. మేనమామ చూసేసరికి..

ప్రతీకాత్మక చిత్రం

ఇలా వుండగా ఓ రోజు చెత్త ఏరుకునే నాగరాజు(40) అనే వ్యక్తిపై ఆమె మనసు పడింది. అతడైతే ఎవరికీ అనుమానం రాదని నిర్ణయించుకుంది. కానీ సమయం కోసం వేచి చూస్తూ ఉండేది. ఈ క్రమంలో ఒక రోజు భర్త పని మీద బయటికి వెళ్లగానే.. చెత్త తీసుకెళ్లడానికి నాగరాజు ఇంట్లోకి వచ్చాడు. అతడితో మాటా మాటా కలిపి, తన మనసులోని కోరికను బయటపెట్టింది. అలా ఇద్దరూ కలిసి రోజూ భర్తకు తెలీకుండా రాసలీలలు సాగించేవారు. చెత్త మీద నెపంతో ఆమె కోసం ఎక్కువగా వస్తుండడంతో చుట్టు పక్కల వారితో పాటూ భర్తకూ అనుమానం వచ్చింది. చివరకు విషయం తెలుకుని భార్య మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకోసారి వాడితో కలిస్తే బాగుండదంటూ హెచ్చరించాడు.

భర్త మాట పెడచెవిన పెట్టిన ఆమె.. తరచూ నాగరాజుతో కలుస్తూ ఉండేది. దీంతో ఆమె భర్త శంకర్.. నాగరాజుపై పగ పెంచుకున్నాడు. అతడ్ని అంతం చేస్తే ఏ సమస్యా ఉండదనుకున్నాడు. స్థానికంగా ఓ పాడుబడ్డ ఇంట్లో ఉంటున్న నాగరాజ్ వద్దకు గురువారం రాత్రి వెళ్లాడు. వెళ్లీ వెళ్లగానే అతడిపై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరుసటి రోజు స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతర విచారణలో నిజాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement