Advertisement
Advertisement
Abn logo
Advertisement

నువ్వు ఆ నీచపు పని చేశావని రుజువయితే విడాకులు ఇచ్చేస్తా.. భర్తకు తేల్చిచెప్పిన భార్య.. అసలు కథేంటంటే..

అతను ముస్లిం బాలికల వసతి గృహంలో పనిచేసే క్లర్క్.. అక్కడే ఉంటున్న 17 ఏళ్ల బాలిక అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అతడు తనపై అత్యాచారం చేశాడని తెలిపింది.. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.. భర్త నిర్వాకంపై భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. అతడు నేరం చేశాడని రుజువైతే విడాకులు ఇచ్చేస్తానని తేల్చి చెప్పింది.. గుజరాత్‌లోని సిల్వస్సాలో ఈ ఘటన జరిగింది. 


సిల్వస్సాలోని మదరసాకు చెందిన ఓ 17 ఏళ్ల బాలికపై అక్కడే పని చేస్తున్న ఓ క్లర్క్ అత్యాచార యత్నం చేశాడనే వార్త స్థానికంగా కలకలం రేపింది. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. బాలికను మెడికల్ టెస్ట్ కోసం పంపించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


తాను ఏ బాలికపైనా అత్యాచారానికి పాల్పడలేదని, కావాలని ఆమె తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని అతడు చెబుతున్నాడు. దీంతో మెడికల్ రిపోర్ట్ కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. కాగా, విచారణలో తన భర్త దోషి అని తేలితే విడాకులు ఇచ్చేస్తానని అతని భార్య తేల్చి చెప్పింది.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement