రీ డిజైనింగ్‌తో సూరమ్మ చెరువు దశ తిరిగేనా..?

ABN , First Publish Date - 2021-06-19T05:51:22+05:30 IST

జిల్లాలోని మేడిపల్లి, కోరుట్ల, కథ లాపూర్‌ మండలాలకు వరప్రదాయిని కలికోట సూరమ్మ చెరువును రిజ ర్వాయర్‌గా మార్చడానికి జరుగుతున్న పనుల్లో జాప్యం రైతులను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి.

రీ డిజైనింగ్‌తో సూరమ్మ చెరువు దశ తిరిగేనా..?
మ్యాప్‌ పరిశీలిస్తున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

ఫ వరద కాలువ నుంచి రివర్స్‌ పంపింగ్‌కు ప్రతిపాదనలు

ఫ మూడేళ్లయినా ముందుకు సాగని కుడి, ఎడమ కాలువల పనులు

ఫ భూ నిర్వాసితులకు అందని పరిహారం

ఫ ఎదురుచూపుల్లో అన్నదాతలు

జగిత్యాల, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మేడిపల్లి, కోరుట్ల, కథ లాపూర్‌ మండలాలకు వరప్రదాయిని కలికోట సూరమ్మ చెరువును రిజ ర్వాయర్‌గా మార్చడానికి జరుగుతున్న పనుల్లో జాప్యం రైతులను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వం పూటకో మాట చెబుతుండడంతో సూరమ్మ చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి నోచుకోలేకపోతోంది. ము చ్చటగా మూడేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావు సుమారు రూ. 204 కోట్ల నిధులతో చేపట్టే కుడి, ఎడమ కాలువ పనులకు ఇప్పటికీ మోక్షం లభించడం లేదు. అప్పుడే దసరా నాటికి జోగాపూర్‌ పంపు హౌజ్‌ నుంచి నీరు తెచ్చి నింపు తామని చెప్పినా హామీ నెరవేరలేకపోయింది. తాజాగా శ్రీరాంసాగర్‌ ప్రా జెక్టు వరద కాలువ నుంచి రివర్స్‌ పంపింగ్‌తో కలికోట శివారులో గల సూరమ్మ చెరువును నింపడానికిగాను రీ డిజైనింగ్‌ చేయాలని అధికార యంత్రాంగం హడావుడి చేస్తోంది.

రీ డిజైనింగ్‌తో ఆయకట్టు పెంపు....

సూరమ్మ రిజర్వాయర్‌ రీ డిజైనింగ్‌తో ఆయకట్టును పెంచడానికి అధి కారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. గతంలో 43 వేల ఎకరాల ఆ యకట్టు ప్రతిపాదనలు ఉండగా ప్రస్తుతం రీ డిజైనింగ్‌తో 69 వేల ఎక రాల ఆయకట్టు ప్రాంతాన్ని పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నా యి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కెనాల్‌ నెట్‌వర్క్‌ ప్యాకేజీ-2 కింద రూ. 204 కోట్ల అంచనా వ్యయంతో 43 వేల ఎకరాలకు సాగునీరు అందించ డానికి గానూ జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం కలికోట వద్ద 2018 జూన్‌ 2వ తేదీన అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హ రీశ్‌రావు పనులను ప్రారంభించారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండ లం లోని జోగాపూర్‌ పంపు హౌజ్‌ నుంచి సూరమ్మ చెరువును నింపడాని కి ప్రతిపాదించారు. ముంపునకు గురయ్యే సుమారు 520 ఎకరాల్లో సుమా రు 830 మంది రైతులకు పరిహారం అందించాలని నిర్ణయించారు. పైపు లైన్‌ సహా మత్తడి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా ఫారెస్ట్‌ విభాగం నుంచి అభ్యంతరాలు ఎదురు కావడం, రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు డబ్బులు చెల్లించకపోవడం వం టి సమస్యలతో పనులు పెండింగ్‌లో పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఏ ర్పడ్డాక సూరమ్మ రిజర్వాయర్‌కు కుడి, ఎడమ కాలువలను స్టేజ్‌ 2, ఫేజ్‌ 1 లో భాగంగా నిర్మించి జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి, కథలాపూర్‌, కోరు ట్ల, మెట్‌పల్లి మండలాలల్లోని సుమారు 43 వేల ఎకరాలకు సాగు నీరం దించాలని నిర్ణయించారు. ఈ కాలువల నిర్మాణం కోసం రు. 204 కోట్లు మంజూరు చేయగా వెన్సా, ష్యూ జాయింట్‌ వెంచర్‌ కంపెనీలు పనులు దక్కించుకున్నాయి. పనులు పూర్తి చేయడానికిగాను కథలాపూర్‌ మండ లంలోని ఇప్పపల్లి శివారులో క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఇ సుక డంపులు నిల్వ చేసుకున్నారు. కాలువల్లో భూములు కోల్పోతున్న వి వరాలతో సర్వేలు కూడా పూర్తి చేసి రెవెన్యూ అధికారులకు అందించా రు. అయితే ఇప్పటికీ నష్టపరిహారంకు సంబంధించి ధరలు నిర్ణయించక పోవడం ప్రభుత్వం డబ్బులు కేటాయించకపోవడంతో పనులకు బ్రేక్‌ పడింది.

మోక్షం లభించేనా....

ఎల్లంపల్లి నీటిని సూరమ్మకు తరలించే క్రమంలో ఎదురవుతున్న ఇ బ్బందులను మేడిపల్లి, కథలాపూర్‌ మండలాలకు చెందిన పలువురు ప్ర జాప్రతినిధులు ఇటీవల మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ దృష్టికి తెచ్చారు. దీంతో వినోద్‌కుమార్‌ ఈ పరిస్థితి సీఎం కేసీఆర్‌ దృష్టికి సైతం తీసుకవెళ్లారు. కథలాపూర్‌ మీదుగా వెళ్తున్న వరద కాలువ వద్ద పంపు ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా సూరమ్మ చెరు వుకు నీరు సరఫరా చేయడానికి నూతనంగా ప్రతిపాదించారు. దీంతో ప్ర స్తుతం స్థిరీకరించిన 42 వేల ఆయకట్టును 69 వేలకు పెంచనున్నారు. ఈ పైపులైను ద్వారా చింతకుంట లక్కాకుల చెరువు, తుర్తి తీగలకుంట, బొమ్మెన శివారులో గల ప్రాజెక్ట్‌లను నింపనున్నారు. దీనికి గాను రు. 321 కోట్లు అవసరమని ఇరిగేషన్‌ అధికారులు సర్వేలు చేసి ప్రణా ళికలు రూపొందించారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పరి శీలనలో ఉన్నాయి. సూరమ్మ రిజర్వాయర్‌ దశ ఎప్పుడు మారుతుం దోన ని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.


Updated Date - 2021-06-19T05:51:22+05:30 IST