చదువులు కొనసాగేనా?

ABN , First Publish Date - 2021-06-18T04:51:34+05:30 IST

కరోనా మహమ్మారి భయ పెడుతోంది. ఫలితంగా విద్యార్థుల చదువులు కొన సాగుతాయన్న ఆందోళన నెలకొంది.

చదువులు కొనసాగేనా?

వెంటాడుతున్న కరోనా మహమ్మారి

ఆన్‌లైన్‌ తరగతులతోనే గతేడాది పూర్తి

ఇబ్బంది పడ్డ అనేక మంది విద్యార్థులు

భయపెడుతున్న థర్డ్‌ వేవ్‌

రెబ్బెన, జూన్‌ 17: కరోనా మహమ్మారి భయ పెడుతోంది. ఫలితంగా విద్యార్థుల చదువులు కొన సాగుతాయన్న ఆందోళన నెలకొంది. విద్యావ్యవస్థ గాడితిప్పంది. ఏడాదిగా అతలాకుతలం అవుతోంది. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నా గ్రామీణ ప్రాం తాల్లోని విద్యార్థులకు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ సౌకర్యం సిగ్నల్స్‌ సరిగ్గా అందక చదువుకు దూరమవుతు న్నారు. అనేక ప్రాంతాల్లో సిగ్నల్స్‌ సరిగ్గా లేక ఆన్‌లైన్‌ తరగతులు ఆగమయ్యాయి. దీంతో విద్యా ర్థులు తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో బాసటగా నిలిచారు. 

ఈ నెల 21నుంచి ప్రారంభమయ్యేనా..?

వాస్తవానికి ఈ విద్యాసంవత్సరం ఈనెల1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ విధించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ వేసవిసెలవులను ఈనెల 20 వరకు పొడగిం చింది. దీంతో చిన్నారులు మరో 20రోజులు చదువు లకు దూరమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం బాటపట్టారు. వారితో పాటే విద్యార్థులు కూడా పొలాల్లోకి వెళ్తున్నారు. జూన్‌ మొదటి వారం లో విద్యార్థులు పుస్తకాలు, పెన్నులు, స్కూల్‌ డ్రెస్‌, బ్యాగులు, ఇతరత్రా సామ్రగి కొనుగోలుకు తల్లిదండ్రులతో మారం చేయాల్సిన కాలంలో పొలం బాట పడుతున్నారు. 

పాఠశాలకు చేరుకోని పుస్తకాలు..

జిల్లాలోని 15 మండలాల్లో అన్ని యజమాన్యాల కింద పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాలలు 908, ప్రాథమికోన్నత పాఠశాలలు 180, ఉన్నత పాఠశా లలు 170 ఉన్నాయి. వాటిల్లో సుమారు 85,900 మంది విద్యార్థులున్నారు. ప్రతి ఏడాది ఇప్పటి వరకు పుస్తకాలు మండల కేంద్రాలకు చేరాల్సి ఉండగా ఈ ఏడాది వాటి జాడలేదు. గతేడాది ప్రాథమిక పాఠశాలలు తెరవకుండానే మూతపడగా విద్యా సంవత్సరం చివరి అంకంలో 8,9,10 తరగతుల విద్యార్థులకు కొద్దిరోజులు మాత్రమే పాఠశాలలు తెరిచి విద్యను బోధిచారు. ఐనప్పటికీ విద్యా సంవత్సరం పూర్తి కాక ముందే మళ్లీ మూత పడ్డాయి. 2021-22 విద్యాసంవత్సరంలో కూడా పాఠ శాలలు తెరుచుకుంటాయన్న నమ్మకం కలగడం లేదు. దీంతో ప్రాథమిక స్థాయి విద్యార్థులు అక్షరా భ్యాసం లేనిదే పైతరగతులకు వెళ్లడం కష్టంగా మారింది. ఈ క్రమంలో 1,2వ తరగతుల విద్యార్థుల చదవులు ఆగమైనట్లే. తల్లిదండ్రులు చదువుకున్న వారైతే ఎలాగోలా కొంత సమయం తమ పిల్లలకు చదువులు నేర్పిస్తున్నారు. చదువు రాని తల్లి దండ్రులకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి.

తల్లిదండ్రుల్లో థర్డ్‌ వేవ్‌ భయం..

కరోనా మహమ్మారి ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ మొత్తం పెద్దలను పట్టి పీడించగా.. థర్డ్‌వేవ్‌లో చిన్నారులు ఇబ్బందిపడతారని వైద్యులు చెబు తుండడంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పటికే పాఠశాలలు మూతపడి ఏడాది దాటింది. థర్డ్‌వేవ్‌ ప్రారంభమైతే పాఠశాలలు తెరవకపోవచ్చనే అభిప్రాయం విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. థర్డ్‌వేవ్‌తో ఈసారి కూడా పాఠశాలలు ప్రారంభమయ్యేనా అని ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు తెరిచినా థర్డ్‌ వేవ్‌ భయంతో తల్లిదండ్రులు తమ పిల్లల ను బడికి పంపుతారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

చదువులు అటకెక్కుతున్నాయి..

లక్ష్మణ్‌, విద్యార్థి తండ్రి

పాఠశాలలు మూసి ఉంచడంతో పిల్లల చదువులు అటకెక్కుతున్నాయి. ముఖ్యంగా 1,2,3 తరగతులు చదువుకునే పిల్లలు చదువు ను పూర్తిగా మరిచి పోతున్నారు. గతేడాది ప్రారంభంలోనే పిల్లలు చదువులు మరిచి పోయారు. గతేడాది బడులు ప్రారంభమవు తాయని భావించినప్పటికీ కరోనా ఉధృతి నేపథ్యంలో సెలవులు పొడగించారు. దీంతో పిల్లలు ఇళ్లలోనే ఆటలతో కాలక్షేపం చేశారు. 

ప్రభుత్వాలు విఫలం..

దుర్గం రవీందర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి

కరోనా వైరస్‌ను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమ య్యాయి. ఫలితంగా విద్యావ్యవస్థపై తీవ్రప్రభావం చూపుతోంది. బడులు మూత పడడంతో విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. చదువులు మరిచి పోయే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా చదువులు కొనసాగేలా కనిపించడం లేదు. 

Updated Date - 2021-06-18T04:51:34+05:30 IST