పనబాకను గెలిపిస్తే అభివృద్ధికి బాటలు

ABN , First Publish Date - 2021-04-14T04:44:37+05:30 IST

పనిచేసే లక్ష్మిగా పేరు తెచ్చుకున్న పనబాక లక్ష్మిని తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధికి బాటలు వేసినట్లేనని టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.

పనబాకను గెలిపిస్తే అభివృద్ధికి బాటలు
పెళ్లకూరు : శిరసనంబేడులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తిక్కారెడ్డికి హారతిపడుతున్న మహిళలు

నాయుడుపేట టౌన్‌ , ఏప్రిల్‌ 13 : పనిచేసే లక్ష్మిగా పేరు తెచ్చుకున్న పనబాక లక్ష్మిని  తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధికి బాటలు వేసినట్లేనని టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. పట్టణంలోని అగ్రహారపేటలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో, పట్టణంలో గత  టీడీపీ ప్రభుత్వంలో  జరిగిన అభివృద్ధి పనుల కరపత్రాలను ఇంటింటికి వెళి అందజేసి  ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు గూడూరు రఘునాథరెడ్డి,  పట్టణ  అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, తెలుగు మహిళ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షురాలు పనబాక  భూలక్ష్మి, పట్టణ పరిశీలకులు బ్రహ్మం చౌదరి, నాయకులు డాక్టర్‌ శ్రీపతిబాబు,  నాగభూషణం, పరిటాల సునీల్‌,  బాబు, నానబాల సుబ్బారావు, సిరాజ్‌, రవి పాల్గొన్నారు. 

రాపూరు  : మండలంలోని ఉత్తర వైపు పల్లెల్లో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలంటూ ఇంటింటి  ప్రచారం   చేశారు. నాయకులు ఖాజావలి, స్థానిక నాయకులు దందోలు వెంకటేశ్వర్లురెడ్డి, నువ్వల శివరామకృష్ణ,  కొండ్లపూడి రాఘవరెడ్డి, లక్కాకుల విజయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు. 

బాలాయపల్లి, ఏప్రిల్‌ 13: తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని మాజీ ఎమ్యేల్యే , టీడీపీ ఎన్నికల పరిశీలకులు పల్లా శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కడగుంట, రామాపురం, గోట్టికాడు గ్రామాల్లో  ప్రచారాన్ని నిర్వహించారు. కడగుంటలో చిత్తూరు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పల్లాశ్రీనివాసులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దాసరి రాజగోపాల్‌నాయుడు, రాయి మస్తాన్‌నాయుడు,రాయి సత్యం నాయుడు,కాగితాల నాగేశ్వరావు, భూతు దనుంజయ్య ,ప్రసన్న పాల్గొన్నారు.


ప్రలోభాలకు గురికావద్దు 

 టీడీపీ నేత పాలకుర్తి తిక్కారెడ్డి

పెళ్లకూరు, ఏప్రిల్‌ 13 : తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు  డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ ప్రలోభ పెడ్తారని, ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి వాటికి దూరంగా ఉండాలని మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం నాయకులు, కార్యకర్తలతో కలసి మండలంలోనే శిరసనంబేడు, రాజుపాళెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేలూరు మురళీకృష్ణారెడ్డి, నాయకులు పేరం రమేష్‌నాయుడు, కృష్ణయ్య, ప్రసాద్‌నాయుడు, డి నాగేంద్రప్రసాద్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, శివకుమార్‌, గోపాల్‌రెడ్డి, కృష్ణయ్య, సుధాకర్‌రెడ్డి, ప్రసాద్‌, వెంకటేశ్వర్లు, రమణయ్య, శిరసనంబేడు సర్పంచ్‌ గుంటపూడి పెంచలయ్య పాల్గొన్నారు. 

దొరవారిసత్రం, ఏఫ్రిల్‌ 13 : మండలంలోని పడమటికండ్రిగ గ్రామంలో గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌ స్థానిక టీడీపీ నాయకులతో కలసి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరతూ ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేశారు.  కార్యక్రమాల్లో టీడీపీ రాష్ట్ర సమన్వకర్త, కడప జిల్లా టీడీపీ నేత  గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధానకార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు ముప్లాళ్ల శ్రీహరిరెడ్డి, ముప్పాళ్ల విజేత, మండల పార్టీ అధ్యక్షడు శ్రీనివాసులనాయుడు, ఆనేపూడి సర్పంచి మురళీకృష్టారెడ్డి  పాల్గొన్నారు. 




Updated Date - 2021-04-14T04:44:37+05:30 IST