ఈ నిరసన నుంచి తప్పుకుంటున్నాం: ఏఐకేఎస్‌సీ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2021-01-27T22:38:21+05:30 IST

అంతే కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న నిరసన నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన ఎంఎస్‌పీపై చట్టబద్ధత సాధించే వరకు శాంతియుతమైన నిరసన చేపడతామని తెలిపారు.

ఈ నిరసన నుంచి తప్పుకుంటున్నాం: ఏఐకేఎస్‌సీ సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న దానికి భిన్నంగా నిరసనను కొనసాగించలేమని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ నేత సర్దార్ వీఎం సింగ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన సంఘటనల పట్ల చాలా అసంతృప్తితో ఉన్నట్లు బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన పేర్కొన్నారు. రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌తో విబేధించారు. రాకేష్‌తో తనకు సంబంధం లేదని అన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న నిరసన నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన ఎంఎస్‌పీపై చట్టబద్ధత సాధించే వరకు శాంతియుతమైన నిరసన చేపడతామని తెలిపారు.


‘‘ప్రజలను కొట్టించడానికి చంపుకోవడానికి మేము ఇక్కడికి రాలేదు. కానీ ఈ నిరసనను కొందరు తప్పుదారి పట్టించాలని చూశారు. ముందుగా అనుకున్నదానికి భిన్నంగా నిరసనను ముందుకు సాగించలేం. రాకేష్ టికాయత్ అనే వ్యక్తితో మాకు సంబంధం లేదు. ఆయన సూచనలు మేం పరిగణలోకి తీసుకోం. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న నిరసన నుంచి మేం తప్పుకుంటున్నాం. అయితే కనీస మద్ధతు ధరపై చట్టబద్ధత సాధించే వరకు శాంతియుత నిరసన కొనసాగిస్తాం’’ అని వీఎం సింగ్ అన్నారు.

Updated Date - 2021-01-27T22:38:21+05:30 IST