జోరు వర్షంలోనూ విధి నిర్వహణ.. మహిళా స్వీపర్‌పై ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2021-05-18T23:47:43+05:30 IST

తౌక్తే తుపాను ప్రభావంతో ముంబైలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ప్రచండ వేగంతో వీచిన గాలులు ప్రజలను

జోరు వర్షంలోనూ విధి నిర్వహణ.. మహిళా స్వీపర్‌పై ప్రశంసల వర్షం

ముంబై: తౌక్తే తుపాను ప్రభావంతో ముంబైలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ప్రచండ వేగంతో వీచిన గాలులు ప్రజలను వణికించాయి. చాలా ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు. మరోవైపు కరోనా భయంతో జనం ఇంటికి పరిమితమయ్యారు. పరిస్థితి ఇలా ఉంటే ఓ మునిసిపల్ వర్కర్ మాత్రం తన విధి నిర్వహణలో రాజీ పడలేదు. వర్షం జోరున కురుస్తున్నా రోడ్లు ఊడ్చడంలో మునిగిపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


వర్షం నుంచి రక్షించేందుకు రెయిన్ కోట్ లేకున్నా, తలకు ప్లాస్టిక్ కవరు చుట్టుకుని ఆమె రోడ్డు ఊడ్చడంలో నిమగ్నమైంది. ఆమె నిబద్ధతను చూసి పలువురు కొనియాడుతున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. ఈ రోజుకు ఇంతకుమించిన మోటివేషన్ లేదని అన్నారు. బీఎంసీ వారికి రెయిన్ కోట్‌లు అందివ్వాలని సూచించారు. వీరు కోవిడ్ వారియర్ల కంటే తక్కువమే కాదని మరికొందరు ప్రశంసించారు. వర్షాకాలం వస్తుండడంతో వారికి రెయిన్ కోట్లు ఇవ్వాలని చాలామంది నెటిజన్లు బీఎంసీకి సూచించారు. ఈ వీడియోను మీరూ చూడండి.



Updated Date - 2021-05-18T23:47:43+05:30 IST