విమానంలో తల్లి చేసిన పనికి పిల్లలు షాక్! ఉక్కపోత తట్టుకోలేనంటూ..

ABN , First Publish Date - 2020-09-02T18:11:37+05:30 IST

విమాన ప్రయాణాలంటే కొందరికి చెప్పలేనంత భయం. అది అంతే.. ఆ నిర్హేతుకభయానికి కారణాలు ఉండవ్! అయితే ఇటువంటి వారు కూడా విధిలేని పరిస్థితుల్లో ఒక్కోసారి ఏరోప్లేన్‌లో కాలు పెట్టక తప్పుదు. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు తమషా!

విమానంలో తల్లి చేసిన పనికి పిల్లలు షాక్! ఉక్కపోత తట్టుకోలేనంటూ..

కియవ్: విమాన ప్రయాణాలంటే కొందరికి చెప్పలేనంత భయం. అది అంతే.. ఆ నిర్హేతుకభయానికి వారు బందీలైపోతారు! అయితే ఇటువంటి వారు కూడా  ఒక్కోసారి ఏరోప్లేన్‌లో కాలు పెట్టక తప్పుదు. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు తమషా! విమానం నుంచి బయటపడేందుకు వారి ప్రాణం తహతహలాడుతుంటుంది. ఎయిర్ ప్లోన్ ల్యాండైపోయినా కూడా వారి మనసు కుదుట పడదు. నేల మీద కాలు పెట్టేంత వరకూ ఆ ఆందోళన తగ్గదు. దీంతో వారేం చేస్తున్నారో వారికే తెలీని స్థితిలో జారిపోయి నానా హంగామా సృష్టిస్తారు. 


ఉక్రెయిన్‌కు చెందిన ఓ మహిళ విషయంలో పాపం అదే జరిగింది. టర్కీలో హాలీడే పూర్తి చేసుకుని ఆమె స్వదేశానికి తిరుగుప్రయాణం ప్రారంభించింది.  మైనర్లైన ఇద్దరు పిల్లలతో ఆమె ప్లేన్ ఎక్కింది. అయితే విమానం ల్యాండైన తరువాత ఆమె ఉక్కపోత పెరిగిపోతోందంటూ హడావుడి మొదలెట్టింది. అందరికంటే చివరగా విమానం ఆమె దిగాల్సి రావడంతో ఆమె తన మనసులోని అలజడిని నిగ్రహించలేకపోయింది. 


ఏం చేస్తోందో గుర్తించలేని స్థితిలో ఆమె విమానం ఎమర్జెన్సీ తలుపును తెరిచి గాలి కావాలంటూ రెక్కలపై నడవడం ప్రారంభించింది. మరి ఆ తరువాత మనసుకు ఏం తోచిందో ఏమోగానీ..అలా కొంత దూరం ముందుకెళ్లి మళ్లీ విమానంలోకి వచ్చేసింది. అయితే మహిళ కంటే ముందే విమానం దిగిన ఆమె సంతానం తల్లి ఎయిరో ప్లేన్ రెక్కలపై వాకింగ్ చేస్తున్న సీన్ చూసి ఒక్కసారిగా షాకయ్యారు. 


‘ఆమె మా అమ్మే.. ఎందుకలా చేస్తోంది’ అంటూ నోరెళ్ల బెట్టారు. అయితే .. పైలట్ అప్పటికే ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించడంతో వారు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.  విచారణ సందర్భంగా తను ఎందుకు అలా చేసిందో మాత్రం ఆమె అధికారులకు చెప్పలేకపోయంది. ఇక వైద్యులు జరిపిన పరీక్షల్లో ఆమె ఎటువంటి డగ్ర్స్ కానీ మద్యం కానీ తీసుకోలేదని వెల్లడైంది. దీంతో ఘటన తీవ్రత దృష్ట్యా ..ఆమె మళ్లీ అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించకుండా అధికారులు నిషేధించారు. 






Updated Date - 2020-09-02T18:11:37+05:30 IST