మహిళ సంపాదన నెలకు రూ. 3లక్షలు.. ఎలాగో తెలిస్తే నవ్వాపుకోలేరు!

ABN , First Publish Date - 2021-03-31T02:43:47+05:30 IST

నెలకు మూడు లక్షలు సంపాదించాలంటూ ఎంత కష్టపడాలో మనకందరికీ తెలిసిందే. ఏ డాక్టరో, ఇంజినీరో, సొంత వ్యాపారమో లేదా బాడా సంస్థల్లో కీలక ఉద్యోగాలు చేస్తూ ఉండాలి. కానీ.. ఓ మహిళ మాత్రం ఇవేవీ లేకుండా నెలకు మూడు లక్షలు సంపాదిస్తోంది. అది ఎలాగో తెలిస్తే మాత్రం నవ్వాపుకోలేరు

మహిళ సంపాదన నెలకు రూ. 3లక్షలు.. ఎలాగో తెలిస్తే నవ్వాపుకోలేరు!

ఇంటర్నెట్ డెస్క్: నెలకు మూడు లక్షలు సంపాదించాలంటూ ఎంత కష్టపడాలో మనకందరికీ తెలిసిందే. ఏ డాక్టర్‌గానో, ఇంజినీర్‌గానో లేదా సొంత వ్యాపారమో..ఇవేవీ కాకపోతే బాడా సంస్థల్లో కీలక ఉద్యోగాలు చేస్తూనో ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. కానీ.. అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇవేవీ లేకుండా చాలీ ఈజీగా నెలకు మూడు లక్షలు సంపాదిస్తోంది. ఆమె పేరు ఎమ్మా మార్టిన్(48). తాను అపానవాయువు విడుస్తుండగా తీసిన వీడియోలను ఓ వెబ్‌సైట్‌లో పెట్టడం ద్వారా ఆమె ఇంత భారీ మొత్తంలో సంపాదిస్తోంది. 1999 నుంచి ఈ పనిలో ఉన్న ఆమె తొలుత లైవ్ స్రీమింగ్ ద్వారా ఇలా చేసేదట. అయితే కొవిడ్ నేపథ్యంలో ఓ వెబ్‌సైట్‌లో తన వీడియోలను అప్‌లోడ్ చేస్తోంది. ఏడు నిమిషాల నిడివి ఉన్న వీడియో చూపించేందుకు ఆమె నాలుగు డాలర్లు తీసుకుంటారు. ‘ఇటువంటి వీడియోలంటూ ఇష్టపడే వారు ఉన్నారని తెలిసి మొదట నేను ఆశ్చర్యపోయా’ అని ఎమ్మా చెప్పారు. తన వీడియోల గురించి భర్తకు మాత్రమే తెలుసన్న ఎమ్మా.. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలోనే ఈ వీడియోలు రికార్డు చేస్తానని తెలిపారు. అంతేకాకుండా ఇలా నిరంతరం అపానవాయువులు విడిచేందుకు ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా తీసుకుంటానని ఆమె తెలిపారు. అంతేకాదు తన అభిమానుల అభిరుచికి మేరకు ప్రత్యేకమైన వీడియోలు కూడా చేస్తుంటానని ఆమె చెప్పారు.

Updated Date - 2021-03-31T02:43:47+05:30 IST