Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రోల్ బంకులో పనిచేస్తున్న యువతి.. 17 ఏళ్ల యువకుడితో పరార్.. అతని తల్లి కేసు పెట్టడంతో..

ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్ బంకులో ఉద్యోగం చేస్తున్న ఒక 19ఏళ్ల యువతి.. తరచూ పెట్రోల్ కోసం వచ్చే ఒక ఇంటర్మీడియెట్ విద్యార్థిపై మనసు పారేసుకుంది. ఈ క్రమంలోనే అతనితో చనువుగా మెలగసాగింది. ఇటీవలే ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన సదరు కుర్రాడిని కలిసిన ఆమె.. అతనితో కలిసి పారిపోయింది. ఆపై కుర్రాడిని పెళ్లాడింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో వెలుగు చూసింది. పొల్లాచ్చికి చెందిన ఒక యువతి కోయంబత్తూర్‌లో పెట్రోల్ బంకులో పనిచేస్తోంది. అదే ప్రాంతంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఒక 17 ఏళ్ల కుర్రాడు.. ఆమె పనిచేసే పెట్రోల్ బంకుకు తరచూ వచ్చేవాడు.


ఈ నేపథ్యంలో అతన్ని ఇష్టపడిన సదరు యువతి.. అతన్ని తీసుకొని తాజాగా పారిపోయింది. పళని వెళ్లి అక్కడ అతన్ని పెళ్లిచేసుకుంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ కోయంబత్తూర్ వచ్చేశారు. అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగించసాగారు. ఆ కుర్రాడి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన జంట.. పోలీసుల ముందు లొంగిపోయింది. సదరు యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత కుర్రాడిపై ఆమె లైంగిక దాడికి పాల్పడిందని పోలీసులు చెప్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement