Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒకే దెబ్బతో రెండు పిట్టలు కొట్టే ప్లాన్ వేసిన కిలాడి మహిళ.. మరిదితో వివాహం చేసుకోవడానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలా తొలగించుకుందంటే..

మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ తన భర్త, మరిది భార్యను అడ్డుతొలగించుకోవడానికి ఒక పెద్ద ప్లాన్ వేసింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు భర్తను చాలా చాకచక్యంగా హత్య చేసి ఆ నింద మరిది భార్య కుటుంబంపై వేసింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా పరిధి సనావల్ గ్రామానికి చెందిన కామిని(27, పేరు మార్చబడినది) అనే మహిళకు తన మరిది(భర్త తమ్ముడ) రవితో గత రెండు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. కానీ రవికి కూడా వివాహం కావడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఎలాగైనా రవి భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టాలని ఆలోచించేది. ఈ క్రమంలో ఒకరోజు కామిని తన మరిది రవితో శృంగారం చేస్తుండగా.. రవి భార్య మీనా(పేరు మార్చబడినది) చూసింది.


తమ వివాహేతర సంబంధం గురించి మీనా బయట చెప్పకుండా ఉండడానికి కామిని, రవిలు ఒక ప్లాన్ వేశారు. మీనా భోజనంలో మత్తు కలిపేశారు. అలా మీనా గాఢనిద్రలో ఉంది. కామిని భర్త అశోక్‌తో ఫుల్‌గా మందు తాగించి అతను స్పృహ కోల్పోయాడు. ఆ తరువాత కామిని అశోక్ బట్టలు తీసి గాఢనిద్రలో ఉన్న మీనా పక్కన పడుకోబెట్టింది. ఇద్దరూ కలిసి పడుకున్నట్లు ఫోటోలు తీసింది. ఇదంతా చేయడానికి కామినికి రవి బాగా సహకరించాడు.


మీనా నిద్రలేచాక తమ విషయం బయటకు చెబితే ఆ ఫొటోలు వైరల్ అవుతాయని కామిని బ్లాక్‌మెయిల్ చేసింది. ఇదంతా భరించలేని మీనా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. మీనా తన పుట్టింటి కుటుంబసభ్యులతో జరిగినదంతా ఏడుస్తూ చెప్పింది. మరోవైపు మీనా తనంట తానే అడ్డు తొలగిపోయిందనుకుంటున్న కామినికి అదే సమయంలో మీనా కుటుంబ సభ్యులు మాట్లాడాలని పిలిచారు. అప్పుడు కామిని ఒంటరిగా వెళ్లకుండా తన భర్త అశోక్‌ని వెంట తీసుకెళ్లింది. అక్కడ పెద్దలంతా జరిగిన దాని గురించి అడిగారు. 


అప్పుడు అశోక్(కామిని భర్త) వారందరికీ తన తప్పు లేదని.. ఏదో మత్తులో జరిగిపోయిందని చెప్పాడు. ఆ మాటలకి మీనా కుటుంబ సభ్యులంతా కలిసి అతడిని చితకబాదారు. దీంతో అశోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ తరువాత కామిని తన భర్తను మీనా కుటుంబ సభ్యులు హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారంతా ఇంటికి పిలిచి కొట్టడంతోనే తన భర్త చనిపోయాడని కామిని పోలీసులకు చెప్పింది.


పోలీసులు మీనా కుటుంబ సభ్యులను హత్య కేసులో అరెస్టు చేసి విచారణ చేస్తుండగా.. అనుకోకుండా నిజం బయటపడింది. అశోక్ పోస్టుమార్టం రిపోర్టుతో కామిని బండారం తెలిసింది. మీనా కుటుంబసభ్యులు కొట్టడం వల్ల అశోక్ చనిపోలేదని.. ఎవరో ఆస్పత్రిలో ఉన్నప్పుడు అతడి గొంతు నులిమి చంపేశారని పోస్టుమార్టంలో వెల్లడైంది. దీంతో పోలీసులు కామినిని అరెస్టు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అశోక్‌ను ఆ సమయంలో అక్కడే ఉన్న కామిని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.


ప్రస్తుతం కామినిపై అశోక్ హత్య కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement