గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం దాల్చిన మహిళ.. కవలల జననం!

ABN , First Publish Date - 2021-04-01T02:36:18+05:30 IST

ర్భం దాల్చిన కొద్ది రోజులకే మళ్లీ గర్భం దాల్చిన ఓ బ్రిటన్ మహిళ రెబెకా రాబర్ట్స్ ఉదంతం ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వైద్య పరిభాషలో దీన్ని సుపర్ ఫిటేషన్ అని పిలుస్తారు. ఈ క్రమంలో పిండం గర్భాశయంలో స్థిరపడ్డ తరువాత కూడా మహిళ మళ్లీ గర్భం దాలుస్తుంది. కేవలం 0.3 శాతం సందర్భాల్లో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో రెండో పిండం బతికే అవకాశాలు చాలా తక్కువని డాక్టర్లు చెబుతున్నారు. అయితే.. అదృష్టవశాత్తూ రెబెకా రాబర్ట్స్ ఇటీవల ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది.

గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం దాల్చిన మహిళ.. కవలల జననం!

ఇంటర్నెట్ డెస్క్: గర్భం దాల్చిన కొద్ది రోజులకే మళ్లీ గర్భం దాల్చిన ఓ బ్రిటన్ మహిళ రెబెకా రాబర్ట్స్ ఉదంతం ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వైద్య పరిభాషలో దీన్ని సుపర్ ఫిటేషన్ అని పిలుస్తారు. ఈ క్రమంలో పిండం గర్భాశయంలో స్థిరపడ్డ తరువాత కూడా మహిళ మళ్లీ గర్భం దాలుస్తుంది. కేవలం 0.3 శాతం సందర్భాల్లో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో రెండో పిండం బతికే అవకాశాలు చాలా తక్కువని  డాక్టర్లు చెబుతున్నారు. అయితే.. అదృష్టవశాత్తూ రెబెకా రాబర్ట్స్ విషయంలో  ఇద్దరు బిడ్డలూ జీవించారు. గతేడాది సెప్టెంబర్‌లొనే ఆమె ప్రసవించింది. మగబిడ్డ నోవా ఆరోగ్యంగా ఉండగా.. రెండో బిడ్డ రోసలీ తక్కువ బరువుతో పుట్టడంతో వైద్యులు రోసలీ 95 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి కొద్ది వారాల క్రితమే డిశ్చార్జ్ చేశారు. ఇద్దరూ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

Updated Date - 2021-04-01T02:36:18+05:30 IST